News14th Mar 01:00 PMSunil Byrisetty1 min read
శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారికి పట్టువస్త్రాలు సమర్పించిన మంత్రి ఆనం
కొండ బిట్రగుంటలో అంగరంగ వైభవంగా శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. 6వ రోజు శుక్రవారం కమనీయంగా వెంకటేశ్వర స్వామి కల్యాణ మహోత్సవం కొనసాగింది. శాసన మండల
కొండ బిట్రగుంటలో అంగరంగ వైభవంగా శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి.
6వ రోజు శుక్రవారం కమనీయంగా వెంకటేశ్వర స్వామి కల్యాణ మహోత్సవం కొనసాగింది.
శాసన మండలి సభ్యులు బీద రవిచంద్ర, కావలి శాసన సభ్యులు దగుమాటి వెంకట కృష్ణారెడ్డితో కలిసి ప్రభుత్వ లాంఛనాలతో స్వామి, అమ్మవార్లకు పట్టు వస్త్రములు దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి సమర్పించారు.
మంత్రికి పూర్ణకుంభంతో వేదపండితులు, ప్రజాప్రతినిధులు ఘనస్వాగతం పలికారు.
అశేష భక్తజనంతో కలిసి శ్రీదేవి భూదేవి సమేత శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి దివ్య కల్యాణ మహోత్సవ వేడుకను భక్తిశ్రద్ధలతో మంత్రి ఆనం రామనారాయణరెడ్డి వీక్షించారు.
వేలసంఖ్యలో విచ్చేసిన భక్తుల గోవింద నామస్మరణలు, వేదపండితుల మంత్రోచ్ఛారణలతో కొండ బిట్రగుంట మారుమోగుతోంది.