Spiritual23rd Nov 02:32 PMSunil Byrisetty1 min read

శ్రీ పద్మావతీ అమ్మవారి వాహ‌న‌సేవ‌లో త‌రిస్తున్న శ్రీ రంగం శ్రీ‌వైష్ణ‌వులు

తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాల వాహన సేవల్లో శ్రీ రంగం శ్రీ‌వైష్ణ‌వులు తరిస్తున్నారు. ప్రతిరోజూ ఉదయం, రాత్రి వేళల్లో అమ్మవారు పలు వాహనాలపై ఊరేగుతూ భక్తులకు దర్శనమిస్

శ్రీ పద్మావతీ అమ్మవారి వాహ‌న‌సేవ‌లో త‌రిస్తున్న శ్రీ రంగం శ్రీ‌వైష్ణ‌వులు
తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాల వాహన సేవల్లో శ్రీ రంగం శ్రీ‌వైష్ణ‌వులు తరిస్తున్నారు. ప్రతిరోజూ ఉదయం, రాత్రి వేళల్లో అమ్మవారు పలు వాహనాలపై ఊరేగుతూ భక్తులకు దర్శనమిస్తున్నారు. ఈ సేవల్లో అమ్మవారి వాహనాలను మోస్తున్నది తమిళనాడులోని శ్రీరంగానికి చెందిన శ్రీవైష్ణవ సంప్రదాయపరులు. శ్రీరంగంతో పాటు పరిసర ప్రాంతాలకు చెందిన పలువురు శ్రీవైష్ణవ సంప్రదాయపరులు గత 35 ఏళ్లుగా విశేష సేవలు అందిస్తున్నారు. శ్రీ అమ్మవారి వాహనం మోతాదుకు మించి బరువు ఉన్నా కేవలం భక్తి భావంతో ఎంతటి బరువున్నా అమ్మవారి సేవలో తరిస్తున్నారు. ఒక్కో వాహనానికి మర్రి ఊడలతో తయారు చేసిన 28 అడుగుల పొడువైన 4 తండ్లును, కొయ్యతో తయారు చేసిన రెండు అడ్డ పట్టీలు, గొడుగు పలకలు, ఇద్దరు అర్చకులు, గొడుగులు పెట్టేందుకు మరో ఇద్దరు ఉంటారు, ఒకరా ఇద్దరా కాదు ఏకంగా 50 మందికి పైగా వైష్ణవ భక్తులు అమ్మవారి వాహనసేవ కైంకర్యంలో పాలు పంచుకుంటున్నారు. వీరంతా చెన్నై, కోయంబత్తూరు, బెంగళూరు, హైదరాబాద్ తదితర ప్రాంతాల్లో ఐటి రంగంలోను, రైల్వే ఉద్యోగులు, బ్యాంక్ ఉద్యోగులు, ప్రభుత్వ ఉద్యోగులు, వ్యాపారస్తులు, ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో పని చేస్తున్నారు. వీరితోపాటు విద్యార్థులు కూడా ఉన్నారు.
Sri Padmavathi Ammavari
Vahanaseva
Sri Ranga Srivaishnavas
Brahmotsavam
Tiruchanur
Devotional Service
దేవాలయ పండుగలు
వైష్ణవ సంప్రదాయం
చెన్నై వైష్ణవులు
భక్తుల సేవ
Scroll for the next article