News10th May 02:07 PMSunil Byrisetty1 min read
మంగళగిరి నియోజకవర్గంలో స్త్రీశక్తి కాంతులు
ఊర్లలో పాత ఇళ్లు ఏ గుమ్మం చూసినా, పసుపు రంగులో కనిపిస్తుంది. శుభానికి సంకేతం అయిన పసుపు కొందరు పూస్తే, మరికొందరు పసుపు రంగు పెయింట్ చేస్తారు. మంగళగిరి నియోజకవర్గంలోని
ఊర్లలో పాత ఇళ్లు ఏ గుమ్మం చూసినా, పసుపు రంగులో కనిపిస్తుంది.
శుభానికి సంకేతం అయిన పసుపు కొందరు పూస్తే, మరికొందరు పసుపు రంగు పెయింట్ చేస్తారు.
మంగళగిరి నియోజకవర్గంలోని వేలాది ఇళ్లలో స్వయం ఉపాధి శుభ సంకేతం పసుపు రంగులో కుట్టు మిషన్లు మనకు దర్శనమిస్తాయి.
ఇవన్నీ 2022 నుంచి నేటివరకూ నారా లోకేష్ తన సొంత నిధులతో మహిళామణుల స్వయం ఉపాధి కోసం ఉచితంగా అందించినవే.
మంగళగిరి నియోజకవర్గంలో తమ కాళ్లపై తాము నిలబడాలనుకునే వారికి చేయూతనందించేందుకు మంత్రి లోకేష్ వివిధవర్గాల సంక్షేమానికి ఏడు పథకాలు రూపొందించి, పకడ్బందీగా అమలు చేశారు. చేనేతలు, స్వర్ణకారులు, మహిళలు, చిరువ్యాపారుల స్వయం ఉపాధికి తన సొంతనిధులతో పరికరాలు, సామాగ్రి, పెట్టుబడిగా అందజేశారు.
మంగళగిరి నియోజకవర్గంలో కుల,మతాలకు అతీతంగా ఆసక్తి గల మహిళలకు ఉచితంగా బ్యూటీషియన్ కోర్సు, టైలరింగ్ శిక్షణకు ఉద్దేశించిన స్త్రీశక్తి పథకాన్ని ప్రారంభించారు. మంగళగిరి నియోజకవర్గ కేంద్రంలో తొలి స్త్రీ శక్తి కేంద్రం 2022,జూన్20 ప్రారంభించారు.
ఈ కేంద్రం ఇప్పటివరకూ 43 బ్యాచుల్లో 2226 మందికి నిపుణులైన వారితో శిక్షణ ఇప్పించారు.
శిక్షణాకాలంలో దారం-సూది కూడా మహిళలు తీసుకురావాల్సిన అవసరం లేకుండా, కేంద్రం నుంచే ఉచితంగా సరఫరా చేశారు.
శిక్షణ పూర్తి చేసుకున్న 2226 మందికి సర్టిఫికెట్లు అందజేసి, కుట్టుమిషన్లు ఉచితంగా అందజేశారు.