Spiritual19th Aug 12:25 PMSunil Byrisetty1 min read

ఇంద్రకీలాద్రిపై ఆర్ట్ ఆఫ్ లివింగ్ రవిశంకర్ పూజలు

ప్రముఖ ఆధ్యాత్మిక సంస్థ ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకులు, ఆధ్యాత్మిక గురువు శ్రీ శ్రీ రవిశంకర్ గురూజీ ఇంద్రకీలాద్రిపై వేంచేసియున్న శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానాన్ని స

ఇంద్రకీలాద్రిపై ఆర్ట్ ఆఫ్ లివింగ్ రవిశంకర్ పూజలు
ప్రముఖ ఆధ్యాత్మిక సంస్థ ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకులు, ఆధ్యాత్మిక గురువు శ్రీ శ్రీ రవిశంకర్ గురూజీ ఇంద్రకీలాద్రిపై వేంచేసియున్న శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానాన్ని సందర్శించారు. ఆయనతో పాటు మాజీ పార్లమెంట్ సభ్యులు గోకరాజు గంగరాజు కూడా అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయానికి విచ్చేసిన రవిశంకర్ గురూజీ గారికి దుర్గగుడి చైర్మన్ బొర్రా రాధాకృష్ణ, దేవస్థాన కార్యనిర్వహణాధికారి వీ.కే. సీనా నాయక్, పాలకమండలి (ట్రస్ట్ బోర్డ్) సభ్యులు ఆలయ మర్యాదలతో ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం వారు అంతరాలయంలో శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. దర్శనానంతరం ఆలయ వేద పండితులు వారికి వేదాశీర్వచనం పలకగా, చైర్మన్ బొర్రా రాధాకృష్ణ, ఈవో సీనా నాయక్ గారు అమ్మవారి శేషవస్త్రం, తీర్థప్రసాదాలు మరియు అమ్మవారి చిత్రపటమును గురూజీకి బహూకరించారు.
Andhra Pradesh
Sri Sri Ravi Shankar
Art of Living
Indrakeeladri
Kanaka Durga Temple
Vijayawada
గోకరాజు గంగరాజు
ప్రత్యేక పూజలు
దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానం
ఆంధ్రప్రదేశ్
ఆలయ దర్శనం
Scroll for the next article