News5th Jul 12:57 PMSunil Byrisetty1 min read

అనారోగ్య బాధితుడికి మంత్రి సుభాష్ ఆర్థిక సహాయం

అనారోగ్యంతో బాధపడుతున్న ఒక వ్యక్తికి కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ శనివారం రూ.20 వేలు ఆర్థిక సహాయం అందించారు. రామచంద్రపురం నియోజవర్గం కె. గంగవరం మండలం వట్రపూడి గ్రామానికి చె

అనారోగ్య బాధితుడికి మంత్రి సుభాష్ ఆర్థిక సహాయం
అనారోగ్యంతో బాధపడుతున్న ఒక వ్యక్తికి కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ శనివారం రూ.20 వేలు ఆర్థిక సహాయం అందించారు. రామచంద్రపురం నియోజవర్గం కె. గంగవరం మండలం వట్రపూడి గ్రామానికి చెందిన గునిపె రామకృష్ణ వెన్నుపూస సమస్యతో బాధపడుతూ మంచానికే పరిమితమై ఆరోగ్యపరంగా, ఆర్థికపరంగా ఇబ్బందులు పడుతున్నారు. ఆ కుటుంబ కష్టం తెలుసుకున్న మంత్రి సుభాష్, రామకృష్ణ ఇంటికి వెళ్లి ఆయన భార్య లక్ష్మీకి రూ. 20 చెక్కును ఆర్థిక సహాయంగా అందించారు. తమ కుటుంబానికి ఆర్థిక ఆసరా అందించిన మంత్రి సుభాష్‌కు కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. తన దైనందిన జీవితంలో నిత్యం పేద ప్రజలకు, అనారోగ్యంతో బాధపడుతున్న వారికి, కష్టంలో ఉన్నవారిని పలు విధాలుగా ఆదుకుంటూ ముందుకు సాగిపోతున్న మంత్రి సుభాష్ సామాజిక సేవా కార్యక్రమాల పట్ల ప్రజలు, కూటమి పార్టీ నాయకులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
Andhra Pradesh news
Gangavaram Mandal
Labour minister
Vasamsetti Subash
financial help
అనారోగ్య బాధితుడికి మంత్రి సుభాష్ ఆర్థిక సహాయం
Scroll for the next article