News8th May 10:11 AMSunil Byrisetty1 min read

అన్నవరం.. అద్భుతాల నిలయం!

అన్నవరం, శ్రీ సత్యనారాయణ స్వామివారు, అనంత లక్ష్మీ సత్యవతి అమ్మవారితో కలసి కొలువు తీరిన ప్రదేశం. పిలిస్తే పలికే దైవంగా పేరుపొందిన శ్రీ సత్యనారాయణ స్వామి ఆలయాన్ని రత్నగిరి అనే కొండపై

అన్నవరం.. అద్భుతాల నిలయం!
అన్నవరం, శ్రీ సత్యనారాయణ స్వామివారు, అనంత లక్ష్మీ సత్యవతి అమ్మవారితో కలసి కొలువు తీరిన ప్రదేశం. పిలిస్తే పలికే దైవంగా పేరుపొందిన శ్రీ సత్యనారాయణ స్వామి ఆలయాన్ని రత్నగిరి అనే కొండపై అన్నవరంలో నిర్మించారు. శ్రీ వీర వేంకట సత్యనారాయణ స్వామి వారి దివ్యక్షేత్రం. కొత్తగా పెళ్ళయిన జంటలు తప్పక సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకోవడం హిందూ ఆచారం. ఇళ్ళలో వ్రతం చేసుకోవడం సంగతి అలా ఉంచి అన్నవరం సత్యనారాయణ స్వామి వారి దేవాలయంలో వ్రతం చేసుకోవడం మరీ శ్రేష్టమని భావిస్తారు. కొందరు అలా చేసుకోవాలని కూడా మొక్కుకుంటారు. ఇక్కడ సామూహికంగా వందలాది దంపతులు కూర్చుని ఒకేసారి సత్యనారాయణస్వామి వ్రతాన్ని కనుల పండుగగా చేసికొంటూ ఉండటం ఒక ప్రత్యేకతగా చెబుతారు. అన్నవరం సత్యనారాయణ స్వామి దేవాలయంలో ప్రవేశించగానే ప్రశాంతత చేకూరుతుంది అనేది భక్తుల అనుభవం. ''హరిహర హిరణ్యగర్భ త్రిమూర్త్యాత్మక స్వరూప'' అంటూ రాసిన శ్లోకాన్ని భక్తులందరూ తప్పక పఠిస్తారు. అన్నవరం సత్యనారాయణ స్వామి దేవాలయాన్ని దర్శించుకున్న వారి కోరికలు, వెంటనే నెరవేరుతాయని భక్తులు విశ్వసిస్తారు. ఈరోజు అన్నవరంతోపాటు పేరూరు శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి కళ్యాణం, అత్తిలి, అన్నవరప్పాడు , శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణం కూడా అత్యంత వైభవోపేతంగా జరుగుతాయి.
Annavaram
Sri Veera Venkata Satyanarayana Swamy
అనంత లక్ష్మీ సత్యవతి
శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి కళ్యాణం
అత్తిలి
అన్నవరప్పాడు
Scroll for the next article