Spiritual12th Dec 03:43 PMSunil Byrisetty1 min read
దేవాదాయ శాఖ మంత్రిని కలిసిన శ్రీశైలం దేవస్థానం బోర్డు సభ్యులు
శ్రీశైలం దేవస్థానం బోర్డు సభ్యులు సచివాలయంలో దేవాదాయ శాఖ మంత్రిని కలిసి దేవస్థానంలో డిజిటల్ పేమెంట్స్ అమలుకు వినతిపత్రం అందజేశారు. పారదర్శక సేవలకు డిజిటల్ వ్యవస్థ కీలకమని వివరించార
శ్రీశైలం దేవస్థానం బోర్డు సభ్యులు సచివాలయంలో దేవాదాయ శాఖ మంత్రిని కలిసి
దేవస్థానంలో డిజిటల్ పేమెంట్స్ అమలుకు వినతిపత్రం అందజేశారు. పారదర్శక సేవలకు డిజిటల్ వ్యవస్థ కీలకమని వివరించారు. బోర్డు సభ్యుల ప్రతిపాదనపై దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి సానుకూలంగా స్పందించారు.
శ్రీశైలం దేవస్థానంలో డిజిటల్ చెల్లింపుల అమలుకు చర్యలు తీసుకుంటామన్నారు. దేవస్థానంలో డిజిటల్ పేమెంట్స్ వ్యవస్థను వేగంగా అమలు చేయడానికి అవసరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. శ్రీశైలం దేవస్థానం బోర్డు సభ్యులు బోడేపూడి వెంకట సుబ్బారావు (BSR), ఆనిల్ కుమార్, పిచ్చయ్య దేవస్థానంలో లావాదేవీలు పారదర్శకంగా, వేగంగా అమలు చేయడం అత్యవసరమని మంత్రి ఆనంకి వివరించారు. దీనితో భక్తుల రద్దీ తగ్గడమే కాకుండా సేవల నాణ్యత పెరుగుతుందని వారు తెలిపారు.