News2nd Apr 09:06 AMSunil Byrisetty1 min read
శ్రీశైలం మల్లన్నకు విశేషంగా ఆదాయం
శ్రీశైలం మల్లన్న హుండీ ఆదాయం భారీగా పెరిగింది. 27 రోజులకు గానూ రూ.6.10 కోట్లు వచ్చినట్లు దేవాలయ అధికారులు తెలిపారు. దీంతో పాటు 20.1 తులాల బంగారం, 6.2 కిలోల వెండిని భక్తులు సమర్పించ
శ్రీశైలం మల్లన్న హుండీ ఆదాయం భారీగా పెరిగింది. 27 రోజులకు గానూ రూ.6.10 కోట్లు వచ్చినట్లు దేవాలయ అధికారులు తెలిపారు.
దీంతో పాటు 20.1 తులాల బంగారం, 6.2 కిలోల వెండిని భక్తులు సమర్పించినట్లు చెప్పారు.
అదే విధంగా 990 యూఎస్ డాలర్లు, ఇతర దేశాల కరెన్సీ కూడా హుండీలో వేసినట్లు పేర్కొన్నారు.
ఇటీవల ఉగాది వేడుకల సందర్భంగా శ్రీశైలానికి భక్తులు పోటెత్తిన విషయం తెలిసిందే.