Spiritual18th Jul 12:31 PMSunil Byrisetty1 min read

శ్రీశైలం దర్శన విధానాల్లో మార్పులు..!

శ్రీశైలం దేవస్థానం దర్శన విధానాల్లో కీలక మార్పులు తెస్తూ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. సెలవు రోజుల్లో దర్శన విధానాల్లో మార్పులను శ్రీశైలం దేవస్థానం EO శ్రీనివాసరావు ప్రకటించారు.

శ్రీశైలం దర్శన విధానాల్లో మార్పులు..!
శ్రీశైలం దేవస్థానం దర్శన విధానాల్లో కీలక మార్పులు తెస్తూ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. సెలవు రోజుల్లో దర్శన విధానాల్లో మార్పులను శ్రీశైలం దేవస్థానం EO శ్రీనివాసరావు ప్రకటించారు. భక్తుల రద్దీ దృష్ట్యా ఉదయం వేళల్లో అలంకార దర్శనం.. ఉదయం నిర్ణీత సమయంలో నేరుగా వచ్చే వీఐపీలకు మాత్రమే స్పర్శదర్శనం కల్పిస్తామని తెలిపారు. సిఫార్సు లేఖలతో వచ్చే భక్తులకు దేవస్థానం సాయంత్రం స్పర్శదర్శనం కల్పించనుంది. భక్తులకు సంతృప్తికర దర్శనం అందించడమే లక్ష్యమని EO శ్రీనివాసరావు స్పష్టం చేశారు. ఈ నిర్ణయంతో దేవస్థానం సిబ్బంది, పాలకమండలి సేవలపై భక్తుల ప్రశంసలు కురిపించారు.
Andhra Pradesh
Temple News
Srisailam Temple
Srisailam Devasthanam
Darshan
Sparsha Darshan
VIP Darshan
భక్తులు
దేవాలయ వార్తలు
ఆంధ్రప్రదేశ్
ఆలయ పరిపాలన
Scroll for the next article