Spiritual3rd Sep 03:35 PMSunil Byrisetty1 min read

7న శ్రీశైలం గుడి మూసివేత

ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలంలోని భ్రమరాంబిక మల్లికార్జున స్వామి ఆలయ ద్వారాలను ఈనెల 7వ తేదీ మధ్యాహ్నం 1.00 గంట నుంచి ఎనిమిదో తేదీ ఉదయం 5 గంటల వరకు మూసివేస్తున్నట్లు దేవస్థానం కార్య

7న   శ్రీశైలం గుడి  మూసివేత
ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలంలోని భ్రమరాంబిక మల్లికార్జున స్వామి ఆలయ ద్వారాలను ఈనెల 7వ తేదీ మధ్యాహ్నం 1.00 గంట నుంచి ఎనిమిదో తేదీ ఉదయం 5 గంటల వరకు మూసివేస్తున్నట్లు దేవస్థానం కార్యనిర్వాహణాధికారి శ్రీనివాసరావు తెలిపారు. చంద్రగ్రహణం కారణంగా 7వ తేది స్వామి స్పర్శ దర్శనం పూర్తిగా నిలుపుదల చేసినట్టు ఆయన తెలిపారు. ఆలయంలోని అన్ని ఆర్జిత సేవలు, పరోక్ష సేవలు, ఆదిదంపతుల కళ్యాణోత్సవం పూర్తిగా నిలిపివేశారు. ఆ రోజున అలంకార దర్శనం మాత్రమే భక్తులందరికీ అవకాశం. సాక్షి గణపతి, హఠకేశ్వరం, పాల ధార, పంచదార, శిఖరేశ్వరం, తదితర పరివార ఆలయ ద్వారాలను కూడా మూసివేస్తారు. సెప్టెంబర్ 8న ఉదయం ఐదు గంటలకు ఆలయ ద్వారాలను తెరిచి, ఆలయ శుద్ధి సంప్రోక్షణ జరిపించిన తర్వాత ప్రాతః కాలం పూజలు ప్రారంభిస్తారు. అనంతరం ఉదయం 7:30 గంటల నుంచి శ్రీ స్వామి అమ్మవార్ల కు మంగళ హారతులు జరిపిస్తారు. మంగళ హారతుల సమయం నుంచి అనగా ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 2.15 గంటల వరకు స్వామి అలంకార దర్శనం కల్పిస్తారు.
Srisailam Temple
Mallikarjuna Swamy
Bhramaramba Devi
Lunar Eclipse 2025
Temple Closure
Andhra Pradesh Temples
Hindu Rituals
7న శ్రీశైలం గుడి మూసివేత
చంద్రగ్రహణం 2025
ఆలయ మూసివేత
Scroll for the next article