News5th Aug 05:36 PMSunil Byrisetty1 min read

సీమ అవసరాలకే శ్రీశైలం నీటి విడుదల

ఎల్ నినో పరిస్థితుల నేపథ్యంలో రాష్ట్రంలో తాగునీటి భద్రతకు ప్రభుత్వం అత్యున్నత ప్రాధాన్యత ఇస్తుందని మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. అందులో భాగంగానే రాయలసీమ ప్రాంత తాగునీటి అవసరాల

సీమ అవసరాలకే శ్రీశైలం నీటి విడుదల
ఎల్ నినో పరిస్థితుల నేపథ్యంలో రాష్ట్రంలో తాగునీటి భద్రతకు ప్రభుత్వం అత్యున్నత ప్రాధాన్యత ఇస్తుందని మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. అందులో భాగంగానే రాయలసీమ ప్రాంత తాగునీటి అవసరాల దృష్ట్యా శ్రీశైలం జలాశయం నుంచి హంద్రీనీవా, పోతిరెడ్డిపాడు ప్రాజెక్టులకు నీటి విడుదల చేపడుతున్నామని పేర్కొన్నారు. ప్రస్తుతం శ్రీశైలం జలాశయంలో 119 టీఎంసీల నీరు అందుబాటులో ఉండగా, రానున్న పది రోజుల్లో మరో 100 టీఎంసీల వరకు ఇన్‌ఫ్లో వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నామన్నారు. ఎల్ నినో ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకుని 2027 జూన్ వరకు శ్రీశైలం జలాలను ప్రధానంగా తాగునీటి అవసరాల కోసం భద్రపరిచే విధంగా ప్రభుత్వం ప్రణాళిక రూపొందించిందని స్పష్టం చేశారు. కృష్ణా జలాల్లో ఆంధ్రప్రదేశ్‌కు ఉన్న 63 శాతం వాటాలో తొలి ప్రాధాన్యత తాగునీటికే ఇస్తున్నట్లు చెప్పారు. హంద్రీనీవా పరిధిలోని రిజర్వాయర్ల తాగునీటి అవసరాల కోసం 13 టీఎంసీలు, పోతిరెడ్డిపాడు పరిధిలోని రిజర్వాయర్లకు 10 టీఎంసీల నీటిని రేపటి నుంచి విడుదల చేయనున్నామని తెలిపారు.
Andhra Pradesh
Srisailam Reservoir
Rayalaseema
Drinking Water
Handri Neeva
పోతిరెడ్డిపాడు
ఎల్ నినో
నిమ్మల రామానాయుడు
జలవనరులు
కృష్ణా నది
Scroll for the next article