News16th Oct 05:54 PMSunil Byrisetty1 min read
అవకాశాలను అందిపుచ్చుకోండీ
అమరావతి ప్రాంతంలో అవకాశాలను అందిపుచ్చుకోవాలని పెట్టుబడిదారులను రాష్ట్ర యువజన సర్వీసులు, పర్యాటక, సాంస్కృతిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్.ఎస్.రావత్ కోరారు. అమరావతి ఎస్.ఆర్.ఎం
అమరావతి ప్రాంతంలో అవకాశాలను అందిపుచ్చుకోవాలని పెట్టుబడిదారులను రాష్ట్ర యువజన సర్వీసులు, పర్యాటక, సాంస్కృతిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్.ఎస్.రావత్ కోరారు. అమరావతి ఎస్.ఆర్.ఎం విశ్వవిద్యాలయంలో సి.ఐ.ఐ ప్రాంతీయ సదస్సు జరిగింది. ఈ కార్యక్రమంలో యువజన సర్వీసులు, పర్యాటక, సాంస్కృతిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్.ఎస్.రావత్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ ప్రాంతంలో తొమ్మిది జిల్లాలు ఉన్నాయని, రాష్ట్ర జి.డి.పికి 35 శాతం సమకూర్చుతుందన్నారు. 2030, 2035, 2047 సంవత్సరాలకు సాధించాల్సిన ఆర్థిక అభివృద్ధి ప్రణాళికలను రూపొందించడం జరిగిందని చెప్పారు. సుస్థిర, సమ్మిళిత అభివృద్ధి సాధించుటకు ప్రణాళికలు ఉన్నాయని తెలిపారు . ఈ ప్రాంతంలో వివిధ రకాల 46 ప్రాజెక్టుల పనులు జరుగుతున్నాయని, 26 ఎం.ఎస్.ఎం.ఇ లకు 480 ఎకరాలు కేటాయించడం జరిగిందని వివరించారు. మచిలీపట్నం పోర్టు అనుసంధానంగా ఉంటుందని అన్నారు. ప్రకాశం జిల్లాలో బి.పి.సి.ఎల్ రిఫైనరీ, దోనేపూడిలో భారత డైనమిక్స్ సంస్థ యూనిట్ రానుందని చెప్పారు. పర్యాటక రంగంలో కూడా పెద్ద ఎత్తున అవకాశాలు ఉన్నాయని తెలిపారు.