Sports11th Jul 12:14 PMSunil Byrisetty1 min read

ఘనంగా ఎస్ఎస్ జీ వార్షిక క్రీడల పోటీలు

ఆంధ్రప్రదేశ్ ఇంటెలిజెన్స్ విభాగంలోని స్పెషల్ సెక్యూరిటీ గ్రూప్ వార్షిక క్రీడల పోటీలు ఘనంగా జరిగాయి. మంగళగిరిలోని ఎస్ఎస్ జీ గ్రౌండ్స్ లో నిర్వహించిన ఈ క్రీడా పోటీలకు ముఖ్య అతిథిగా అ

ఘనంగా ఎస్ఎస్ జీ వార్షిక క్రీడల పోటీలు
ఆంధ్రప్రదేశ్ ఇంటెలిజెన్స్ విభాగంలోని స్పెషల్ సెక్యూరిటీ గ్రూప్ వార్షిక క్రీడల పోటీలు ఘనంగా జరిగాయి. మంగళగిరిలోని ఎస్ఎస్ జీ గ్రౌండ్స్ లో నిర్వహించిన ఈ క్రీడా పోటీలకు ముఖ్య అతిథిగా అదనపు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ మహేష్ చంద్ర లడ్హా, ఐజీ పీహెచ్ డీ రామకృష్ణ తదితర సీనియర్ అధికారులు పాల్గొన్నారు. స్పెషల్ సెక్యూరిటీ గ్రూప్ డైరెక్టర్ ఏ.జగదీష్, ఎస్పీ చెన్నుపాటి భద్రయ్య ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వార్షిక పోటీల్లో 25 క్రీడాంశాల్లో విజేతలుగా నిలిచిన వారికి బహుమతులు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఇంటెలిజెన్స్ చీఫ్ మహేష్ చంద్ర లడ్హా టగ్ ఆఫ్ వార్ పోటీలను ప్రారంభించారు. క్రీడల పోటీల్లో ఆరు విభాగాల్లో మొదటి స్థానంలో నిలిచిన ఎస్. కమలేంద్రరావు ఈ ఏడాది వార్షిక క్రీడల్లో ఓవరాల్ ఛాంపియన్ గా నిలిచారు. క్రీడలు శారీరక ధృడత్వాన్ని మానసిక ఉల్లాసాన్ని, టీమ్ స్పిరిట్ ను పెంపొందిస్తాయని ఇంటెలిజెన్స్ చీఫ్ తన ప్రసంగంలో పేర్కొన్నారు.
Andhra Pradesh Intelligence
Special Security Group
SSG
Annual Sports Meet
Mangalagiri
Mahesh Chandra Laddha
A. Jagadish
చెన్నుపాటి భద్రయ్య
ఏపీ పోలీసులు
క్రీడా పోటీలు
Scroll for the next article