Agriculture22nd Jul 04:32 PMSunil Byrisetty1 min read

పంట మార్పిడితో ప‌దిల‌మైన ఆదాయం

వివిధ ర‌కాల పంట‌ల‌ను ఒక క్రమపద్ధతిలో పండించ‌డం ద్వారా నేల ఆరోగ్యం మెరుగుప‌డుతుంద‌ని ఎన్టీఆర్ జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ అన్నారు. తెగుళ్లు, క‌లుపు మొక్క‌లు వంటి స‌మ‌స్య‌ల‌తో

పంట మార్పిడితో ప‌దిల‌మైన ఆదాయం
వివిధ ర‌కాల పంట‌ల‌ను ఒక క్రమపద్ధతిలో పండించ‌డం ద్వారా నేల ఆరోగ్యం మెరుగుప‌డుతుంద‌ని ఎన్టీఆర్ జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ అన్నారు. తెగుళ్లు, క‌లుపు మొక్క‌లు వంటి స‌మ‌స్య‌ల‌తో పాటు ఎరువుల అవ‌స‌ర‌మూ త‌గ్గుతుంద‌ని పేర్కొన్నారు. క‌లెక్ట‌ర్ ల‌క్ష్మీశ మంగ‌ళ‌వారం నందిగామ మండ‌లం, కేత‌వీరునిపాడు గ్రామంలో పొలం పిలుస్తుంది కార్య‌క్ర‌మంలో పాల్గొన్నారు. రైతుల‌తో మాట్లాడి ప్ర‌స్తుతం ఏ పంట‌లు పండిస్తున్నారు.. ఏవైనా స‌మ‌స్య‌లు ఉన్నాయా.. వంటి వివ‌రాల‌ను అడిగి తెలుసుకున్నారు. ఉపాధి హామీ ప‌థ‌కం అనుసంధానంతో ఉచితంగా పండ్ల‌, పూల మొక్క‌ల సాగును చేప‌ట్ట‌వ‌చ్చ‌ని, ఉద్యాన పంట‌ల‌తో రైతుల‌కు అధిక, సుస్థిర ఆదాయాలు ల‌భిస్తాయ‌న్నారు. ప‌శుపోష‌ణ ద్వారా కూడా అద‌న‌పు ఆదాయం పొందొచ్చ‌ని, ప్ర‌స్తుతం ప్ర‌భుత్వాలు అందుబాటులో ఉంచిన ప‌థ‌కాల‌ను పూర్తిస్థాయిలో స‌ద్వినియోగం చేసుకోవాల‌ని సూచించారు.
Andhra Pradesh news
Agriculture
Crop Diversification
Collector Lakshmisha
Sustainable Farming
Panta Pilusthundi Program
Farmer Welfare
MGNREGA
పంట మార్పిడితో ప‌దిల‌మైన ఆదాయం
Scroll for the next article