Politics4th Sep 09:04 AMSunil Byrisetty1 min read

స్థానిక సంస్థల ఎన్నికలకు రంగం సిద్ధం!

ఆంధ్రప్రదేశ్‌లో మరో ఎన్నికల జాతర జరగనుంది. స్థానిక సంస్థల ఎన్నికలకు రంగం సిద్ధమవుతోంది. రాష్ట్ర ఎన్నికల సంఘం 2026 జనవరిలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేందుకు కసరత్తు చేయబోతోంది

స్థానిక సంస్థల ఎన్నికలకు రంగం సిద్ధం!
ఆంధ్రప్రదేశ్‌లో మరో ఎన్నికల జాతర జరగనుంది. స్థానిక సంస్థల ఎన్నికలకు రంగం సిద్ధమవుతోంది. రాష్ట్ర ఎన్నికల సంఘం 2026 జనవరిలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేందుకు కసరత్తు చేయబోతోంది. ప్రస్తుత పాలకవర్గాల పదవీకాలం ముగియడానికి ముందే ఎన్నికలు నిర్వహించాలని ఆలోచన చేస్తోంది. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం సాహ్ని పంచాయతీరాజ్, పురపాలక శాఖల కమిషనర్లకు లేఖలు రాశారు. ఎన్నికల నిర్వహణకు ఇప్పటి నుంచే ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఆ లేఖలో తెలిపారు. ప్రస్తుత సర్పంచుల పదవీకాలం వచ్చే ఏడాది ఏప్రిల్‌లో ముగుస్తుంది. వచ్చే ఏడాది మార్చిలో.. నగరపాలక (కార్పొరేషన్లు), పురపాలక (మున్సిపాలిటీలు), నగర పంచాయతీల్లో కార్పొరేటర్లు, కౌన్సిలర్ల పదవీకాలం ముగుస్తుంది. ఐదేళ్ల పదవీకాలం ముగియడానికి మూడు నెలల ముందు ఎన్నికలు నిర్వహించే అవకాశం చట్టంలో ఉంది. అందుకే జనవరిలోనే ఎన్నికలు నిర్వహించాలని కమిషన్ భావిస్తోంది.
Andhra Pradesh
Local Body Elections
SEC
Panchayat Elections
Municipal Elections
Corporations
Councillors
Sarpanch
Neelam Sahni
2026 Elections
స్థానిక పాలకవర్గాలు
రాష్ట్ర ఎన్నికల సంఘం
ఎన్నికల ఏర్పాట్లు
Scroll for the next article