Politics13th Mar 01:07 PMSunil Byrisetty1 min read
స్టాలిన్ బాటలో కేసీఆర్, జగన్ నడుస్తారా?
దేశంలో హాట్ టాపిక్‌గా మారిన దక్షిణాదిపై ఉత్తరాది ఆధిపత్యం అంశంలో తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ ముందడుగేశారు. తనతోపాటు ఎన్డీయేతర పార్టీలు కలిసి రావాలని పిలుపునిస్తున్నారు. హిందీ భాష
దేశంలో హాట్ టాపిక్‌గా మారిన దక్షిణాదిపై ఉత్తరాది ఆధిపత్యం అంశంలో తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ ముందడుగేశారు.
తనతోపాటు ఎన్డీయేతర పార్టీలు కలిసి రావాలని పిలుపునిస్తున్నారు.
హిందీ భాషను రుద్దడంలో కానీ, నిధుల కేటాయింపులో కానీ, పార్లమెంటు సీట్ల పెంపులో కానీ దక్షిణ భారత రాష్ట్రాలకు తీవ్ర అన్యాయం జరుగుతోందని గొంతెత్తుతున్నారు.
కేరళ, తెలంగాణ, కర్ణాటకల్లో ఎన్డీయేతర ప్రభుత్వాలుండగా.. ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం ఉంది.
జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీలను పక్కనపెట్టి ప్రాంతీయ పార్టీలను ఏకతాటిపైకి తెచ్చే ప్రయత్నం చేస్తు్న్నారు.
అందులో భాగంగా బీజేపీపై పోరుకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, వైసీపీ అధ్యక్షుడు జగన్‌లకు కబురు పంపారు. దక్షిణాది రాష్ట్రాలకు జరుగుతున్న అన్యాయంపై కలిసి పోరాడదామని పిలుపునిచ్చారు.
అయితే అధికారంలో కోల్పోయిన ఈ రెండు పార్టీలు స్టాలిన్ మాటతో కదిలొస్తారా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
బీజేపీపై పోరాడే సాహసాన్ని ఈ ప్రతిపక్ష పార్టీలు చేస్తాయా అనే ప్రశ్నలు ఎదురవుతున్నాయి.
ఒకవేళ జగన్, కేసీఆర్ కలిసి స్టాలిన్ మాటకు మద్దతిస్తే జాతీయస్థాయిలో కొత్త చర్చకు తెరలేస్తుందని విశ్లేషకుల అభిప్రాయం.