News9th Nov 04:59 PMSunil Byrisetty1 min read
సంప్రదాయ కళలకు ఆధునిక స్టాల్ ఇన్ మాల్
గ్రామీణ ప్రాంతాల్లోని చేనేత కళాకారులు, హస్తకళాకారులు ఎంతో నైపుణ్యంతో తయారుచేసే సంప్రదాయ ఉత్పత్తులకు ఆధునిక మార్కెటింగ్ అవకాశాలు కల్పించడమే స్టాల్ ఇన్ మాల్ కార్యక్రమం ఉద్దేశమని నాబా
గ్రామీణ ప్రాంతాల్లోని చేనేత కళాకారులు, హస్తకళాకారులు ఎంతో నైపుణ్యంతో తయారుచేసే సంప్రదాయ ఉత్పత్తులకు ఆధునిక మార్కెటింగ్ అవకాశాలు కల్పించడమే స్టాల్ ఇన్ మాల్ కార్యక్రమం ఉద్దేశమని నాబార్డు ప్రాంతీయ కార్యాలయ చీఫ్ జనరల్ మేనేజర్ (సీజీఎం) సోమేందర్ సింగ్ అన్నారు.
సోమవారం విజయవాడ పీవీపీ స్క్వేర్ మాల్‌లో నాబార్డు ప్రాంతీయ కార్యాలయ చీఫ్ జనరల్ మేనేజర్ సోమేందర్ సింగ్.. నేస్తం ఫౌండేషన్ సీఈవో సురేష్ వేసం తదితరులతో కలిసి స్టాల్ ఇన్ మాల్ స్టాళ్లను ప్రారంభించారు. హస్తకళలు, చేనేత కళాకారులతో మాట్లాడి ఉత్పత్తుల గురించి అడిగి తెలుసుకున్నారు. కళాకారులు తయారుచేసిన ఉత్పత్తులను నేరుగా పట్టణ ప్రాంతాల వినియోగదారులకు పరిచయం చేయడం ద్వారా వారికి మెరుగైన మార్కెట్‌ను అందించవచ్చన్నారు. సాధారణంగా గ్రామీణ ప్రాంతాల్లో తయారయ్యే చేనేత వస్త్రాలు, హస్తకళా ఉత్పత్తులు, సంప్రదాయ కళాఖండాలను ప్రజలు ఎక్కువగా సందర్శించే షాపింగ్ మాల్స్‌లో ప్రదర్శనకు ఉంచడం ద్వారా కళాకారులకు కొత్త మార్కెట్ అవకాశాలు లభిస్తాయని వివరించారు. గ్రామీణ కళాకారుల ఉత్పత్తులను పట్టణ వినియోగదారులకు చేరువ చేయడంతో పాటు, సంప్రదాయ కళలు, చేనేత వస్త్రాలు, హస్తకళల పట్ల ప్రజల్లో ఆసక్తిని పెంపొందించడానికి ఇది దోహదపడుతుందని తెలిపారు. స్టాల్ ఇన్ మాల్ స్టాళ్లు ఈ నెల 9 నుంచి ఫిబ్రవరి 8వ తేదీ వరకు అందుబాటులో ఉంటాయన్నారు.