Spiritual27th Jul 12:29 PMSunil Byrisetty1 min read
హరిద్వార్‌లో తొక్కిసలాట
ఉత్తరాఖండ్ రాష్ట్రం హరిద్వార్ లోని మానసా దేవి ఆలయం వద్ద విషాదం జరిగింది. భారీ సంఖ్యలో భక్తులు ఆలయానికి తరలిరావడంతో తొక్కిసలాట చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఆరుగురు భక్తులు ప్రాణాలు కోల
ఉత్తరాఖండ్ రాష్ట్రం హరిద్వార్ లోని మానసా దేవి ఆలయం వద్ద విషాదం జరిగింది. భారీ సంఖ్యలో భక్తులు ఆలయానికి తరలిరావడంతో తొక్కిసలాట చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఆరుగురు భక్తులు ప్రాణాలు కోల్పోగా, పలువురు గాయపడినట్లు గర్హ్వాల్ కమిషనర్ వినయ్ శంకర్ పాండే వెల్లడించారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నామని.. ఆలయం వద్ద సహాయక చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు.
విద్యుత్ షాక్ కారణంగా భయభ్రాంతులకు గురైన భక్తులు పరుగులు పెట్టడంతో తొక్కిసలాట జరిగి ఉండొచ్చని ప్రాథమిక నివేదికలు చెబుతున్నాయి.