News1st Nov 01:56 PMSunil Byrisetty1 min read

కాశీబుగ్గలో తొక్కిసలాట.. 9 మంది మృతి

శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ వేంకటేశ్వరాలయంలో తొక్కిసలాటలో 9 మంది మరణించారు. ఏకాదశి సందర్భంగా భారీగా భక్తులు రాక ప్రధాన కారణంగా తెలుస్తోంది. దేవాలయ సామర్థ్యం 2-3 వేలు కాగా ఇవాళ ఏకంగ

కాశీబుగ్గలో తొక్కిసలాట.. 9 మంది మృతి
శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ వేంకటేశ్వరాలయంలో తొక్కిసలాటలో 9 మంది మరణించారు. ఏకాదశి సందర్భంగా భారీగా భక్తులు రాక ప్రధాన కారణంగా తెలుస్తోంది. దేవాలయ సామర్థ్యం 2-3 వేలు కాగా ఇవాళ ఏకంగా 25 వేల మందికి పైగా తరలివచ్చారు. కార్తీక ఏకాదశి, శనివారం కావడంతో వెంకన్న స్వామి దర్శనం కోసం భారీగా భక్తజనం వచ్చారు. దీంతో సాధారణ స్థాయిలోని రెయిలింగ్ విరగడంతో భక్తులు పడిపోయారు. ఒక్కసారిగా గందరగోళ పరిస్థితి తొక్కిసలాటకు దారితీసింది. ఈ ఘోర విషాదంపై ఏపీ గవర్నర్, సీఎం, డిప్యూటీ సీఎం, కేంద్ర మంత్రులు, పలువురు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
Andhra Pradesh news
Kasibugga stampede
Srikakulam tragedy
Venkateswara temple incident
Ekadashi crowd
9 మంది మృతి
దేవాలయ ప్రమాదం
కార్తీక ఏకాదశి
ప్రభుత్వ స్పందన
Scroll for the next article