News11th Dec 12:33 PMSunil Byrisetty1 min read
రాజధానిలో స్టార్ హోటల్స్!
రాజధాని అమరావతిలో స్టార్ హోటళ్ల నిర్మాణం మొదలైంది. ఐకానిక్ భవనాలు పూర్తయ్యేలసరికి… పూర్తి స్థాయిలో స్టార్ హోటల్స్ కూడా అందుబాటులోకి వచ్చేలా ప్లాన్ చేస్తున్నారు. మూడు పెద్ద స్టార్ హ
రాజధాని అమరావతిలో స్టార్ హోటళ్ల నిర్మాణం మొదలైంది. ఐకానిక్ భవనాలు పూర్తయ్యేలసరికి… పూర్తి స్థాయిలో స్టార్ హోటల్స్ కూడా అందుబాటులోకి వచ్చేలా ప్లాన్ చేస్తున్నారు. మూడు పెద్ద స్టార్ హోటల్స్ ప్రాజెక్టులకు భూమి పూజలు జరిగాయి. దసపల్లా, నోవోటెల్, తాజ్ వివాంతా – ఈ మూడు కలిపి సుమారు రూ. 620 కోట్ల పెట్టుబడి పెడుతున్నాయి. ఇందులో రూ. 200 కోట్లతో 4-స్టార్ హోటల్‌ను దసపల్లా నిర్మిస్తోంది. రెండు ఎకరాల్లో వస్తున్న ఈ హోటల్ నుంచి నాలుగు వందలకు పైగా ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది. 2028 చివరి నాటికి ఆపరేషన్స్ ప్రారంభం కానున్నాయి. ఇక నోవోటెల్ లింగాయపాలెంలో రూ. 220 కోట్లతో 5-స్టార్ హోటల్ & కన్వెన్షన్ సెంటర్‌లను నాలుగు ఎకరాల్లో నిర్మిస్తోంది. ఈ ప్రాజెక్టు 2027 చివరి నాటికి పూర్తవుతుంది. మందడం సీడ్ యాక్సెస్ రోడ్‌లో రూ.200 కోట్లతో తాజ్ వివాంతా 5-స్టార్ హోటల్ నిర్మాణం ప్రారంభమైంది. నాలుగు ఎకరాల్లో తాజ్ గ్రూప్ బ్రాండ్‌తో G.V. ఎస్‌టేట్స్ & హోటల్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఈ ప్రాజెక్టు చేపట్టింది. కన్వెన్షన్ సెంటర్ కోసం అదనంగా 2.5 ఎకరాలు కూడా కేటాయించారు. ఇది కూడా 2028 నాటికి రెడీ అవుతుందని సమాచారం.