Politics8th May 10:43 AMSunil Byrisetty1 min read
త్వరలో నీకూ ‘గాలి’ గతే.. జగన్!
సీఎం చంద్రబాబు నేతృత్వంలో రాష్ట్రంలో శరవేగంగా జరుగుతున్న అభివృద్ధిని చూసి జగన్ ఓర్వలేకపోతున్నారని బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత మండిపడ్డారు. కళ్లల
సీఎం చంద్రబాబు నేతృత్వంలో రాష్ట్రంలో శరవేగంగా జరుగుతున్న అభివృద్ధిని చూసి జగన్ ఓర్వలేకపోతున్నారని బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత మండిపడ్డారు.
కళ్లల్లో నిప్పులు పోసుకుంటూ రాష్ట్రంపైనా, కూటమి ప్రభుత్వంపై విషం చిమ్ముతున్నారని వ్యాఖ్యానించారు.
జగన్ పాపాలు పండే రోజులు దగ్గరపడ్డాయని, త్వరలోనే గాలి జనార్ధన్ రెడ్డి గతే పడుతుందని జోస్యం చెప్పారు.
మహిళల ఆర్థికాభివృద్ధికి ప్రారంభించిన కుట్టు శిక్షణ కార్యక్రమంపై తన పత్రికలో జగన్ తప్పుడు రాస్తున్నారని మంత్రి మండిపడ్డారు.
కూటమి ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం మానుకోకుంటే, ఉన్న 11 సీట్లు కూడా రావని అన్నారు.
మహిళలను ఆర్థిక భరోసా కల్పించాలన్న లక్ష్యంతో సీఎం చంద్రబాబు ఉచిత కుట్టు శిక్షణా కార్యక్రమానికి శ్రీకారం చుట్టారన్నారు.
లక్షా రెండు వేల మందికి పైగా మహిళలకు కుట్టు మిషన్ ఉచితంగా అందజేసి, నిష్ణాతులతో 360 గంటల పాటు ఉచిత శిక్షణ ఇవ్వాలని నిర్ణయించామన్నారు.