Politics11th Apr 02:46 PMSunil Byrisetty1 min read
స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధమవ్వండి
ఏపీలో మరోసారి ఎన్నికల నగారా మోగనుంది. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల ఏర్పాట్లకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం సాహ్ని అధికారులకు సూచనలు చేశారు. పంచాయతీరాజ్, మున్సిపల్ ఎన
ఏపీలో మరోసారి ఎన్నికల నగారా మోగనుంది.
రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల ఏర్పాట్లకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం సాహ్ని అధికారులకు సూచనలు చేశారు.
పంచాయతీరాజ్, మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు సన్నద్ధం కావాలని నీలం సాహ్ని ఆదేశించారు.
రాబోయే సంవత్సరంలో ఏపీలో జరిగే ఎన్నిలకు సిద్ధంగా ఉండాలన్నారు.
ప్రణాళికా బద్ధంగా మాస్టర్ ట్రైనర్ శిక్షణ, పోలీస్ బలగాలు, ఎలక్ట్రోరల్ రోల్ అంశాలపై దృష్టి పెట్టాలన్నారు.
ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా, శాంతియుతంగా జరగేలా ఏర్పాట్లు చేయాలని సూచించారు