Health17th Aug 12:58 PMSunil Byrisetty1 min read

ఉచితంగా వైద్యం - కార్పొరేట్‌ కు దీటుగా సేవలు

సూపర్‌ స్పెషాలిటీ సేవలను ఉచితంగా అందిస్తోన్న ప్రభుత్వాసుపత్రులు రాష్ట్రంలో చాలానే ఉన్నాయి. పలు ప్రభుత్వాసుపత్రులు ఆధునిక పరికరాలతో, సూపర్‌ స్పెషాలిటీ సేవలతో మంచి వైద్యం అందిస్తామని

ఉచితంగా వైద్యం - కార్పొరేట్‌ కు దీటుగా సేవలు
సూపర్‌ స్పెషాలిటీ సేవలను ఉచితంగా అందిస్తోన్న ప్రభుత్వాసుపత్రులు రాష్ట్రంలో చాలానే ఉన్నాయి. పలు ప్రభుత్వాసుపత్రులు ఆధునిక పరికరాలతో, సూపర్‌ స్పెషాలిటీ సేవలతో మంచి వైద్యం అందిస్తామని భరోసా ఇస్తున్నాయి. దాదాపు ఉచితంగా అందే ఈ సేవలు. సామాన్యులకు వరంగా మారుతున్నాయి. ఎవరైనా, ఏ రాష్ట్రం వారైనా వీటిని వినియోగించుకోవచ్చు. గుంటూరులోని జీజీహెచ్‌లో ప్లాస్టిక్‌ సర్జరీ, గ్యాస్ట్రో ఎంటరాలజీ, కార్డియాలజీ, సీటీవీఎస్ వంటి 11 సూపర్‌ స్పెషాలిటీ వైద్య సేవలు, ఒంగోలు జీజీహెచ్‌లో 7 విభాగాలలో వైద్యసేవలు ఉచితంగా అందుబాటులో ఉన్నాయి. కాకినాడ ప్రభుత్వ సామాన్య ఆసుపత్రిలో ప్లాస్టిక్‌ సర్జరీ, పీడియాట్రిక్స్‌ సర్జరీ, న్యూరాలజీ, న్యూరోసర్జరీ, నియోనాటాలజీ, యూరాలజీ, నెఫ్రాలజీ, సర్జికల్, మెడికల్‌ ఆంకాలజీ విభాగాల్లో రోగులకు పైసా ఖర్చు లేకుండా మంచి వైద్య సేవలు అందుతున్నాయి. కర్నూలు జీజీహెచ్‌లోని కార్డియో థొరాసిక్‌ విభాగంలో గుండెకు సంబంధించిన శస్త్రచికిత్సలు చేస్తున్నారు. విజయవాడలోని బోధనాసుపత్రిలో ప్లాస్టిక్‌ సర్జరీ వైద్య సేవలు ప్రతి సోమ, గురువారాల్లో అందిస్తారు.
Government Hospitals
Free Healthcare
Super-Specialty Services
Modern Medical Facilities
Quality Treatment
Affordable Healthcare
State Health Services
Patient Care
Medical Assistance
ప్రభుత్వ ఆసుపత్రులు
ఉచిత వైద్యం
Scroll for the next article