News16th Dec 03:16 PMSunil Byrisetty1 min read

గిరిజన ప్రాంతాల అభివృద్ధికి పలు కార్యక్రమాలు

గిరిజన ప్రాంతాల సమగ్ర అభివృద్ధే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పలు కీలక కార్యక్రమాలను అమలు చేస్తోందని గిరిజన సంక్షేమ, మహిళా & శిశు సంక్షేమ శాఖా మంత్రి గుమ్మిడి సంధ్యారాణి తెలిపారు. గి

గిరిజన ప్రాంతాల అభివృద్ధికి పలు కార్యక్రమాలు
గిరిజన ప్రాంతాల సమగ్ర అభివృద్ధే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పలు కీలక కార్యక్రమాలను అమలు చేస్తోందని గిరిజన సంక్షేమ, మహిళా & శిశు సంక్షేమ శాఖా మంత్రి గుమ్మిడి సంధ్యారాణి తెలిపారు. గిరిజన కుటుంబాల జీవనోపాధి మెరుగుదలతో పాటు ఆర్థికంగా బలోపేతం చేయాలనే ఉద్దేశంతో 76 గోకులాల ఏర్పాటుకు రూ.25 కోట్లు మంజూరు చేసినట్లు మంత్రి వెల్లడించారు. ఒక్కో గోకులంలో 20 పశువుల పంపిణీ ద్వారా 10 మంది లబ్ధిదారులకు ప్రత్యక్షంగా ప్రయోజనం చేకూరుతున్నదని పేర్కొన్నారు. గిరిజన రైతుల వ్యవసాయాభివృద్ధి కోసం హార్టికల్చర్, అగ్రికల్చర్ మరియు మత్స్యకార రంగాల అభివృద్ధికి రూ.19 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. ఈ నిధులతో రైతులు, మత్స్యకారులకు ఆయిల్ ఇంజిన్లు, మల్టీ క్రాప్ మెషీన్లు, థ్రెషర్లు, పవర్ టిల్లర్లు, పవర్ వీడర్లు వంటి వ్యవసాయ పనిముట్లు, అలాగే డ్రాగ్ నెట్లు అందిస్తున్నామని వివరించారు. గిరిజన విద్యార్థులు పోటీ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించి సివిల్స్, బ్యాంకులు, రైల్వేలు, UPSC, SSC వంటి జాతీయ స్థాయి ఉద్యోగాలకు అర్హత సాధించేలా స్కిల్ డెవలప్‌మెంట్ ద్వారా నాణ్యమైన శిక్షణ అందిస్తున్నామని మంత్రి తెలిపారు.
Andhra Pradesh
Tribal Development
Integrated Growth
Gokulam Scheme
Tribal Welfare
Rural Livelihoods
Agriculture Development
Fisheries Support
స్కిల్ డెవలప్‌మెంట్
గిరిజన విద్యార్థులు
ప్రభుత్వ కార్యక్రమాలు
Scroll for the next article