News8th Apr 08:22 PMSunil Byrisetty1 min read
పీ4ని విస్తృత పరిచేలా పటిష్ట వ్యవస్థ
పేదరిక నిర్మూలన లక్ష్యంగా చేపట్టిన ‘జీరోపావర్టీ-పీ4’ కార్యక్రమాన్ని విస్తృత పరిచేలా పటిష్ట వ్యవస్థను నెలకొల్పేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు వేగవంతం చేసింది. ఇందుకు సంబంధించి ‘స్టే
పేదరిక నిర్మూలన లక్ష్యంగా చేపట్టిన ‘జీరోపావర్టీ-పీ4’ కార్యక్రమాన్ని విస్తృత పరిచేలా పటిష్ట వ్యవస్థను నెలకొల్పేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు వేగవంతం చేసింది.
ఇందుకు సంబంధించి ‘స్టేట్ లెవెల్ సొసైటీ’ని ఏర్పాటు చేస్తోంది. దీనికి ముఖ్యమంత్రి చైర్‌పర్సన్‌గా, డిప్యూటీ సీఎం వైస్ చైర్‌పర్సన్‌గా వ్యవహరిస్తారు.
అలాగే సీఈవో, డైరెక్టర్... వారికి అనుసంధానంగా కాల్ సెంటర్, టెక్ టీమ్, ప్రోగ్రాం టీమ్, వింగ్ టీమ్ ఉంటాయి.
జిల్లా చాప్టర్‌కు జిల్లా మంత్రి చైర్‌పర్సన్‌గా, నియోజకవర్గ చాప్టర్‌కు ఎమ్మెల్యే చైర్‌పర్సన్‌గా, గ్రామ, వార్డు స్థాయిలో సెక్రటేరియట్ చాప్టర్లకు చైర్‌పర్సన్‌గా పంచాయతీ కార్యదర్శి, వార్డు అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీలు ఉంటారు.
రాష్ట్ర స్థాయి సొసైటీ ఏర్పాటు, పీ4 పురోగతిపై ముఖ్యమంత్రి చంద్రబాబు మంగళవారం సచివాలయంలో సమీక్ష నిర్వహించారు.
ప్రతి జిల్లా కలెక్టర్, మంత్రులు, ఎమ్మెల్యేలు మార్గదర్శిలను గుర్తించి బంగారు కుటుంబాలను దత్తత తీసుకునేలా చూడాలని చెప్పారు.
దాతలు ఎవరెవరు ఎంత మొత్తం ఇచ్చారు... ఇంకెంత సాయం ‘బంగారు కుటుంబాలు’కు అవసరం అవుతుంది వంటి విషయాలు అన్నీ వెబ్‌సైట్‌లో పొందుపరచడంతో పారదర్శకంగా ఉంటుందని, పీ4పై విశ్వాసం మరింత పెరుగుతుందని ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు.