News4th Dec 04:50 PMSunil Byrisetty1 min read

18,19,20 తేదీల్లో రాష్ట్ర యువజనోత్సవాలు యువ-2025

యువతలో నిక్షిప్తమైన నైపుణ్యాలను వెలికితీయడమే యువజన మహోత్సవం యువ -2025 లక్ష్యమని యువజన సేవల శాఖ కమిషనర్ ఎస్. భరణి తెలిపారు. రాష్ట్ర యువజన సేవల శాఖ ఆధ్వర్యంలో నిర్వహించనున్న రాష్ట్ర

18,19,20 తేదీల్లో రాష్ట్ర యువజనోత్సవాలు యువ-2025
యువతలో నిక్షిప్తమైన నైపుణ్యాలను వెలికితీయడమే యువజన మహోత్సవం యువ -2025 లక్ష్యమని యువజన సేవల శాఖ కమిషనర్ ఎస్. భరణి తెలిపారు. రాష్ట్ర యువజన సేవల శాఖ ఆధ్వర్యంలో నిర్వహించనున్న రాష్ట్ర యువజన మహోత్సవం యువ- 2025 నిర్వహణపై గురువారం స్థానిక ఇందిరా గాందీ మున్సిపల్ స్టేడియంలోని శాప్ ప్రధాన కార్యాలయంలో యువజన సేవల శాఖ కమిషనర్ భరణి పాత్రికేయుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ నెల 18, 19 & 20 తేదీలలో వడ్డేశ్వరం కేఎల్ యూనివర్శిటీ లో రాష్ట్ర స్థాయి యువజన మహోత్సవాలను "యూత్ ఫర్ స్వర్ణాంధ్ర" థీమ్ తో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నామన్నారు. ఈ థీమ్ ముఖ్యంగా యువత ఆలోచనలు, ప్రతిభ, సృజనాత్మకత రాష్ట్ర అభివృద్ధికి ఎంత ముఖ్యమో తెలియజేస్తుందన్నారు. ప్రతి సంవత్సరం జిల్లా, రాష్ట్ర యువజన ఉత్సవాలను నిర్వహించి తద్వారా రాష్ట్ర స్థాయిలో మొదటి బహుమతికి వారిని ఎంపిక చేసి విజేతలను ఢిల్లీలో నిర్వహించే జాతీయ యువజన ఉత్సవాల్లో పాల్గొనడానికి పంపడం జరుపుతుందన్నారు. 15 నుంచి 29 సంవత్సరాల మధ్య వయస్సు గల యువతకు రాష్ట్ర స్థాయి పోటీలు నిర్వహించబడతాయన్నారు. రాష్ట్రంలోని 26 జిల్లాలకు చెందిన మొదటి బహుమతి విజేతలు రాష్ట్ర స్థాయి ఈవెంట్లలో పాల్గొంటారన్నారు. రాష్ట్ర స్థాయిలో మొదటి బహుమతి విజేతలను జాతీయ యువజనోత్సవం-2026లో పాల్గొనడానికి పంపిస్తామన్నారు.
Andhra Pradesh
YUVA 2025
State Youth Festival
Youth Services Department
S. Bharani
KL University Vaddeswaram
Youth for Swarna Andhra
Youth Talent
స్వర్ణాంధ్ర
యువత ప్రతిభ
యువజన పోటీలు
జాతీయ యువజనోత్సవం
Scroll for the next article