News28th Dec 09:28 AMSunil Byrisetty1 min read

రాష్ట్ర క్రైమ్ రివ్యూ

తాడేపల్లిలో రాష్ట్ర స్థాయి క్రైమ్ రివ్యూ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రస్తుత ఏడాదిలో నమోదైన నేరాలు, వాటిపై విధించిన శి

రాష్ట్ర క్రైమ్ రివ్యూ
తాడేపల్లిలో రాష్ట్ర స్థాయి క్రైమ్ రివ్యూ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రస్తుత ఏడాదిలో నమోదైన నేరాలు, వాటిపై విధించిన శిక్షలు, కేసుల పురోగతిపై సమగ్ర సమీక్ష నిర్వహించారు. నేరాల నియంత్రణ, కేసుల త్వరిత పరిష్కారం దిశగా తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. సైబర్ క్రైమ్, క్రిప్టో కరెన్సీ దుర్వినియోగం, బ్లాక్ చైన్ టెక్నాలజీ, డీప్ ఫేక్ టెక్నాలజీ వంటి ఆధునిక సవాళ్లను ఎదుర్కొనేందుకు చేపట్టాల్సిన నివారణ చర్యలపై మంత్రి అనిత అధికారులతో చర్చించారు. సమావేశంలో భాగంగా నేర పరిశోధనలో ఉత్తమ ప్రతిభ కనబర్చిన 12 మంది అధికారులను సన్మానించారు. నూతన సంవత్సరంలో కేసుల పరిష్కారానికి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని మరింత విస్తృతంగా వినియోగించి, నిందితులకు త్వరగా శిక్షలు పడేలా చర్యలు తీసుకోవాలని అధికారులను మంత్రి అనిత ఆదేశించారు.
State Crime Review
Tadepalli
Home Minister
Vangalapudi Anitha
Law and Order
Crime Control
Cyber Crime
Crypto Currency
డీప్ ఫేక్ టెక్నాలజీ
బ్లాక్ చైన్ టెక్నాలజీ
డిజిటల్ పోలీసింగ్
నేర దర్యాప్తు
పోలీస్ శాఖ
Scroll for the next article