News28th Sep 03:40 PMSunil Byrisetty1 min read
ఏనుగుల సంచారం పట్ల అప్రమత్తంగా వ్యవహరించాలి!
ఏనుగుల సంచారం పట్ల నిరంతరం అప్రమత్తంగా వ్యవహరించాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అన్నారు. మానవ-ఏనుగు ఘర్షణలు తలెత్తకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. కుంకీ ఏనుగులను ర
ఏనుగుల సంచారం పట్ల నిరంతరం అప్రమత్తంగా వ్యవహరించాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అన్నారు. మానవ-ఏనుగు ఘర్షణలు తలెత్తకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. కుంకీ ఏనుగులను రంగంలోకి దించి ఏనుగులను అడవిలోకి మళ్లించేందుకు ఏర్పాట్లు చేయాలని కోరారు. హనుమాన్ బృందాలు, పోలీసు, రెవెన్యూ సహకారంతో ఏనుగుల సంచారంపై నిరంతర నిఘా ఉంచాలని సూచించారు. ఏనుగుల సంచారం ఆధారంగా పరిసర గ్రామాల ప్రజల్ని అప్రమత్తం చేయాలన్నారు. పంట నష్టం జరిగిన రైతులకు తక్షణం పరిహారం చెల్లించే ఏర్పాటు చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.