Sports14th Nov 05:03 PMSunil Byrisetty1 min read
ఏషియన్ ఆర్చరీ ఛాంపియన్‌షిప్‌లో తెలుగు తేజాల ప్రతిభ
ఏషియన్ ఆర్చరీ ఛాంపియన్‌షిప్ 2025లో ఆంధ్రప్రదేశ్ ఆర్చర్ వెన్నం జ్యోతి సురేఖ రెండు స్వర్ణ పతకాలు సాధించింది. కాంపౌండ్ మహిళల వ్యక్తిగత విభాగంలో, మహిళల జట్టు విభాగంలో అద్భుత విజయం సాధి
ఏషియన్ ఆర్చరీ ఛాంపియన్‌షిప్ 2025లో ఆంధ్రప్రదేశ్ ఆర్చర్ వెన్నం జ్యోతి సురేఖ రెండు స్వర్ణ పతకాలు సాధించింది. కాంపౌండ్ మహిళల వ్యక్తిగత విభాగంలో, మహిళల జట్టు విభాగంలో అద్భుత విజయం సాధించింది. అద్భుత విజయాలు సాధించి దేశానికి గౌరవం తీసుకువచ్చిన జ్యోతి సురేఖని శాప్ ఛైర్మన్ అనిమినీ రవి నాయుడు అభినందించారు. జ్యోతి సురేఖ విజయాలు మన ఆంధ్రప్రదేశ్ యువ క్రీడాకారులకు ప్రేరణ అని కొనియాడారు. అలాగే ఇదే ఛాంపియన్‌షిప్ లో ఏపీ ప్రతిభను ఆర్చర్ ధీరజ్ బొమ్మదేవర ప్రపంచానికి చాటిన చరిత్ర సృష్టించారని చెప్పారు. రికర్వ్ పురుషుల వ్యక్తిగత విభాగం ఫైనల్‌లో కొరియా ఆర్చర్‌పై ఘన విజయం సాధించి స్వర్ణ పతకం అందుకున్నారన్నారు. రాబోయే రోజుల్లో మరిన్ని అంతర్జాతీయ విజయాలతో
దేశానికి, రాష్ట్రానికి మరింత కీర్తి తీసుకురావాలని మనస్పూర్తిగా కోరుతున్నామన్నారు.