Farmers19th Aug 09:54 AMSunil Byrisetty1 min read
ఎరువుల పంపిణీలో ఇబ్బందులు తలెత్తవద్దు
ఎరువుల సరఫరాలో ఎక్కడా పొరపాట్లకు తావివ్వకుండా, రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని వ్యవసాయ అధికారులను వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అదేశించారు. ఈ ఏడాది ఖరీఫ్ స
ఎరువుల సరఫరాలో ఎక్కడా పొరపాట్లకు తావివ్వకుండా, రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని వ్యవసాయ అధికారులను వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అదేశించారు. ఈ ఏడాది ఖరీఫ్ సీజన్ కు రాష్ట్ర వ్యాప్తంగా ఎరువులు మొత్తం 16.73 లక్షల మెట్రిక్ టన్నుల అంచనా ఉందని, వాటిలో (యూరియా 6.22 లక్షల మెట్రిక్ న్నులు, డి.ఏ.పి- 2.60 లక్షల మెట్రిక్ టన్నులు, ఎం. ఓ పి- 0.70 లక్షల మెట్రిక్ టన్నులు, యస్ యస్ పి - 0.94 లక్షల మెట్రిక్ టన్నులు, కాంప్లెక్స్ లు – 6.30 లక్షల మెట్రిక్ టన్నులు) అవసరం ఉందని కమిషనర్ ఢిల్లీరావు మంత్రికి వివరించారు. కేంద్రం నుంచి ఆగస్ట్ నెలకు సంబంధించి రావల్సిన ఎరువులు రాష్ట్రానికి సరైన సమయంలో అందలేదని దాంతో కొంత ఇబ్బందులు తలెత్తుతున్నాయని తెలిపారు. రాష్ట్రానికి ఇప్పటివరకు 10.39 లక్షల మెట్రిక్ టన్నులు వచ్చాయని, ప్రారంభ నిల్వలు 7.13 లక్షల మెట్రిక్ టన్నులతో కలిపి మొత్తం 17.53 లక్షల మెట్రిక్ టన్నుల వివిధ రకాల ఎరువులను రాష్ట్రంలోని రైతులకు అందుబాటులో ఉంచామని, 10.96 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువులు రైతులకు అందచేశామని తెలిపారు.