TTD3rd Sep 05:35 PMSunil Byrisetty1 min read

తిరుమలలో సేవల మెరుగుదలకు చర్యలు

తిరుమలలోని అన్ని విభాగాల్లో శ్రీవారి సేవకులు సేవలందిస్తున్నారని, భక్తులకు మెరుగైన సేవలు అందించే దిశగా వారికి శిక్షణ ఇస్తున్నట్లు టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు తెలిపారు. సేవకులకు కనీస

తిరుమలలో సేవల మెరుగుదలకు చర్యలు
తిరుమలలోని అన్ని విభాగాల్లో శ్రీవారి సేవకులు సేవలందిస్తున్నారని, భక్తులకు మెరుగైన సేవలు అందించే దిశగా వారికి శిక్షణ ఇస్తున్నట్లు టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు తెలిపారు. సేవకులకు కనీస విద్యార్హత గ్రాడ్యుయేషన్‌ గా నిర్ణయించామని, మూడ్రోజుల శిక్షణతో పాటు ఒకరోజు ఫీల్డ్ విజిట్ ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు. సీఎం చంద్రబాబు సూచన మేరకు స్విమ్స్‌, బర్డ్‌, ఆయుర్వేద ఆస్పత్రుల్లోనూ వాలంటరీ సర్వీసులు అందించనున్నట్లు తెలిపారు. భక్తులకు రుచికరమైన ఆహారం అందించడమే లక్ష్యమని, గతంలో క్యాంటీన్‌ల నిర్వహణ లోపభూయిష్టంగా ఉండేదని గుర్తుచేశారు. ఇకపై క్యాంటీన్‌ల నిర్వహణకు కఠిన నియమాలు అమలు చేస్తామని, టెండర్ ప్రాసెస్ మొత్తం వీడియో రికార్డింగ్ జరుగుతుందని తెలిపారు. ఆదాయం ముఖ్యం కాదని, భక్తులకు మంచి ఆహారం అందించడమే తమ ప్రధాన లక్ష్యమని బీఆర్ నాయుడు స్పష్టం చేశారు.
Andhra Pradesh
Tirumala
TTD
BR Naidu
Chandrababu Naidu
Devotees
Voluntary Services
Training
Hospitals
Food Quality
Canteen Management
Temple Services
Pilgrim Facilities
ఆలయ సేవలు
యాత్రికుల సౌకర్యాలు
భక్తులకు ఆహారం
ఆధ్యాత్మిక సేవలు
Scroll for the next article