News29th Jun 10:31 AMSunil Byrisetty1 min read

50 ఏళ్లకే పెన్షన్!

ఏపీలో పెన్షన్ విషయంలో కూటమి ప్రభుత్వం కీలక ఆలోచన చేస్తోంది. మరో కీలక నిర్ణయం దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. ఎన్నికలకు ముందు ఇచ్చిన మరో హామీని అమలు చేయనున్నట్లు సమాచారం. ఎ

50 ఏళ్లకే పెన్షన్!
ఏపీలో పెన్షన్ విషయంలో కూటమి ప్రభుత్వం కీలక ఆలోచన చేస్తోంది. మరో కీలక నిర్ణయం దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. ఎన్నికలకు ముందు ఇచ్చిన మరో హామీని అమలు చేయనున్నట్లు సమాచారం. ఎన్నికల సమయంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు చెందిన వారికి 50 ఏళ్లకే రూ.4 వేల పింఛను అందజేస్తామని కూటమి హామీ ఇచ్చింది. అధికారంలోకి వచ్చిన తరువాత ఆ హామీ అమలు దిశగా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తున్నది. అన్నదాత సుఖీభవ పథకం తర్వాత ఈ పెన్షన్ మంజూరు చేయనున్నారని సమాచారం.
Andhra Pradesh news
Tdp
Pension
st
Sc
Bc
Annadata Sukhibhav scheme
50 ఏళ్లకే రూ.4 వేల పింఛను
అన్నదాత సుఖీభవ పథకం
Scroll for the next article