News15th Dec 04:39 PMSunil Byrisetty1 min read

ఇంధ‌న పొదుపుతో స్వ‌ర్ణాంధ్ర దిశ‌గా అడుగులు

స‌మ‌ష్టి భాగ‌స్వామ్యంతో ఇంధ‌న పొదుపుతో స్వ‌ర్ణాంధ్ర @ 2047 దిశగా అడుగులు వేద్దామ‌ని.. మ‌హోద్య‌మంగా ఇంధ‌న పొదుపును ముందుకు తీసుకెళ్దామ‌ని ఏపీ జెన్‌కో ఎండీ ఎస్‌.నాగ‌ల‌క్ష్మి, ఎన్టీఆర

ఇంధ‌న పొదుపుతో స్వ‌ర్ణాంధ్ర దిశ‌గా అడుగులు
స‌మ‌ష్టి భాగ‌స్వామ్యంతో ఇంధ‌న పొదుపుతో స్వ‌ర్ణాంధ్ర @ 2047 దిశగా అడుగులు వేద్దామ‌ని.. మ‌హోద్య‌మంగా ఇంధ‌న పొదుపును ముందుకు తీసుకెళ్దామ‌ని ఏపీ జెన్‌కో ఎండీ ఎస్‌.నాగ‌ల‌క్ష్మి, ఎన్టీఆర్ జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ అన్నారు. జాతీయ ఇంధ‌న పొదుపు వారోత్స‌వాలు-2025 (డిసెంబ‌ర్ 14-20)లో భాగంగా సోమ‌వారం న‌గ‌రంలోని క‌లెక్ట‌ర్ క్యాంపు కార్యాల‌యం నుంచి ఇందిరాగాంధీ మునిసిప‌ల్ స్టేడియం వ‌ర‌కు ర్యాలీ జ‌రిగింది. అనంతరం స్టేడియంలో జ‌రిగిన ప్ర‌త్యేక కార్య‌క్ర‌మంలో ఏపీ జెన్‌కో ఎండీ ఎస్‌.నాగ‌ల‌క్ష్మి, జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ‌.. ఏపీ ట్రాన్స్‌కో జేఎండీ జి.సూర్య‌సాయి ప్ర‌వీణ్‌చంద్, ఏపీ సీపీడీసీఎల్ సీఎండీ పి.పుల్లారెడ్డి, నెడ్‌క్యాప్ వీసీ, ఎండీ క‌మ‌లాక‌ర్ బాబు త‌దిత‌రులు పాల్గొని ప్రతిజ్ఞ చేయించారు. ఏపీ సీపీడీసీఎల్.. బీఈఈ సౌజ‌న్యంతో స్టేట్ ఎన‌ర్జీ క‌న్జ‌ర్వేష‌న్ మిష‌న్ ప‌ర్య‌వేక్ష‌ణలో ఏర్పాటు చేసిన కార్య‌క్ర‌మంలో జాతీయ ఇంధ‌న పొదుపు పోస్ట‌ర్ల‌ను ఆవిష్క‌రించారు. అత్యంత విలువైన విద్యుత్ ఏ రూపంలోనూ వృధా కాకుండా ఎల్ల‌ప్పుడూ జాగ్ర‌త్త‌గా వ్య‌వ‌హ‌రిస్తాన‌ని.. విద్యుత్ పొదుపు సందేశం అంద‌రికీ చేరేలా పాటుప‌డ‌తానంటూ ప్ర‌తిజ్ఞ చేయించారు.
Andhra Pradesh Government
Energy Conservation
Swarna Andhra 2047
National Energy Conservation Week
AP GENCO
NTR District
District Collector
ఎనర్జీ కన్జర్వేషన్
విద్యుత్ పొదుపు
ర్యాలీ
అవగాహన కార్యక్రమం
Scroll for the next article