Politics5th Oct 05:08 PMSunil Byrisetty1 min read
‘స్థితప్రజ్ఞుడు’ వైయస్ జగన్!
వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో ‘స్థితప్రజ్ఞుడు’ పుస్తకావిష్కరణ పుస్తకాన్ని వైఎస్సార్‌సీపీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి ఆవిష్కరించారు. సీనియర్ జర్నలిస్ట్, టెక్నోక్రా
వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో ‘స్థితప్రజ్ఞుడు’ పుస్తకావిష్కరణ
పుస్తకాన్ని వైఎస్సార్‌సీపీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి ఆవిష్కరించారు. సీనియర్ జర్నలిస్ట్, టెక్నోక్రాట్ డాక్టర్ కొత్తపల్లి శ్రీనివాస వర్మ ఈ పుస్తకాన్ని రచించారు. మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైయస్ జగన్ రాజకీయ జీవనయానం, ఆయన రాజకీయ ప్రస్థానంలోని వివిధ ఘట్టాలు, నాయకత్వ లక్షణాలను సమగ్రంగా సంకలనం చేస్తూ డా. శ్రీనివాస వర్మ ఈ పుస్తకాన్ని రచించారు. సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ, జగన్ రాజకీయ ప్రస్థానాన్ని సమగ్రంగా అధ్యయనం చేసి ‘స్థితప్రజ్ఞుడు’ పేరుతో పుస్తక రూపంలో తీసుకురావడం అభినందనీయమన్నారు. ఒక రాజకీయ నాయకుడి ప్రయాణాన్ని, ఆయన ఎదుర్కొన్న పరిస్థితులను, తీసుకున్న నిర్ణయాలను, ప్రజలతో ఏర్పరచుకున్న అనుబంధాన్ని పుస్తక రూపంలో భద్రపరచడం భవిష్యత్ తరాలకు ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. “రాజకీయ చరిత్రను కేవలం సంఘటనలుగా కాకుండా, వాటి వెనుక ఉన్న పరిస్థితులు, నాయకత్వ ధోరణి, ప్రజలతో ఉన్న సంబంధాన్ని కూడా నమోదు చేయాల్సిన అవసరం ఉంది. ఆ దిశగా ‘స్థితప్రజ్ఞుడు’ ఒక మంచి ప్రయత్నం” అని పేర్కొన్నారు.