International8th Apr 09:50 AMSunil Byrisetty1 min read
స్టాక్ మార్కెట్లలో డబ్బు రావడం భ్రమ!
ప్రపంచవ్యాప్తంగా స్టాక్లు నేలచూపులు చూస్తున్న వేళ కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు. యువత స్టాక్‌మార్కెట్లకు దూరంగా ఉండాలంటూ సూచించారు. స్టాక్ మార్కెట్ల నుంచి
ప్రపంచవ్యాప్తంగా స్టాక్లు నేలచూపులు చూస్తున్న వేళ కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు.
యువత స్టాక్‌మార్కెట్లకు దూరంగా ఉండాలంటూ సూచించారు. స్టాక్ మార్కెట్ల నుంచి డబ్బులు సంపాదించడం భ్రమ అని వ్యాఖ్యానించారు.
దేశ జనాభాలో కేవలం ఒక శాతం మాత్రమే స్టాక్‌మార్కెట్లలో పెట్టుబడులు పెడుతున్నారన్నారు.
ప్రస్తుత సమయంలో స్టాక్ మార్కెట్లకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిదని రాహుల్ తెలిపారు.
మరోవైపు అంతర్జాతీయంగా, దేశీయంగా స్టాక్ మార్కెట్ కుదేలవడంతో లక్షల కోట్ల రూపాయల సంపద ఆవిరైంది.
అమెరికా అధినేత ట్రంప్ సుంకాలపై తీసుకున్న నిర్ణయం ప్రపంచ స్టాక్ మార్కెట్లను ప్రభావితం చేస్తోంది.