News26th May 05:05 PMSunil Byrisetty1 min read
విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ నిలుపుదల చేయాలి
విజయవాడ ధర్నా చౌక్ లో విశాఖ ఉక్కు కాంట్రాక్ట్ కార్మికుల సమ్మెకు మద్దతుగా కార్మిక సంఘాలు ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా సి.ఐ.టి.యు రాష్ట్ర నాయకులు వి.వి.ఎల్ నరసింహులు, aituc రాష్ట్ర న
విజయవాడ ధర్నా చౌక్ లో విశాఖ ఉక్కు కాంట్రాక్ట్ కార్మికుల సమ్మెకు మద్దతుగా కార్మిక సంఘాలు ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా సి.ఐ.టి.యు రాష్ట్ర నాయకులు వి.వి.ఎల్ నరసింహులు, aituc రాష్ట్ర నాయకులు ఎస్.వెంకట సుబ్బయ్య,iftu రాష్ట్ర నాయకులు కె.పోలారి లు మాట్లాడారు. ఈ కార్యక్రమానికి సి.ఐ.టి.యు జిల్లా ఉపాధ్యక్షులు కె. దుర్గారావు,ఎఐటియుసి నగర ప్రధాన కార్యదర్శి ఎం. సాంబశివరావు అధ్యక్షత వహించారు. కేంద్రంలోని బి.జె.పి ప్రభుత్వం పధకం ప్రకారం కార్మికులను తొలగించేయత్నాలను చేపట్టిందని, రాష్ట్రంలోని ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మోడీ సేవ ఆపి కాంట్రాక్ట్ కార్మికుల చేస్తున్న సమ్మె పరిష్కారానికి కృషి చేయాలని డిమాండ్ చేశారు. స్టీల్ ప్లాంట్ కార్మికులు తమ సమస్యల పరిష్కారానికి సమ్మె చేస్తున్నారని ఈ సమ్మెను పరిష్కరించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయని అన్నారు.వారు తమ జీతాల కోసం, రెగ్యులరైజేషన్ కోసం కాకుండా తమను ఉద్యోగాల నుంచి తొలగించేందుకు ప్రభుత్వమే ప్రయత్నం చేస్తున్నందున వారు సమ్మె చేస్తున్నారన్నారు.