Electronics23rd Apr 01:43 PMSunil Byrisetty1 min read
మొబైల్ పోయిందా? మీ పేరుపై ఎన్ని సిమ్‌లు ఉన్నాయి?
మీ ఫోన్ పోయిందా? దుర్వినియోగం కాకుండా బ్లాక్ చేయాలా? లేక మీ పేరుపై ఎన్ని సిమ్ కార్డులు చలామణీ అవుతున్నాయో తెలుసుకోవాలా? ఇలాంటి వివరాల కోసం కేంద్ర ప్రభుత్వం సంచార్ సాథీ యాప్, వెబ్ స
మీ ఫోన్ పోయిందా? దుర్వినియోగం కాకుండా బ్లాక్ చేయాలా? లేక మీ పేరుపై ఎన్ని సిమ్ కార్డులు చలామణీ అవుతున్నాయో తెలుసుకోవాలా? ఇలాంటి వివరాల కోసం కేంద్ర ప్రభుత్వం సంచార్ సాథీ యాప్, వెబ్ సైట్‌లను అందుబాటులోకి తెచ్చింది.
దీని ద్వారా మీ మొబైల్ స్థితి ఏంటనేది కూడా తెలుసుకోవచ్చు.
ఎవరైనా దొంగిలించిన ఫోన్ ఐఎంఈఐ నంబర్ మార్చేసి అమ్మేస్తే కొన్న ఫోన్లలో రిజిస్టర్డ్ ఐఎంఈఐ నంబర్ ఉండదు.
ఇలాంటివన్నీ ఆ సైట్ ద్వారా తెలుసుకోవచ్చు.
మీ పేరుతో ఉన్న మొబైల్ కనెక్షన్ల వివరాలను తెలుసుకోవడానికి మరియు మీకు అవసరం లేని లేదా తీసుకోని కనెక్షన్లను గుర్తించి తొలగించడానికి సంచార్ సాథీ యాప్ ఉపయోగించవచ్చు.
మరిన్ని వివరాల కోసం సంచార్ సాథీ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి లేదా https://sancharsaathi.gov.in పోర్టల్ ని సందర్శించాలి.
అలాగే ఫ్రాడ్, స్పామ్ కాల్స్‌కూ చెక్ పెట్టవచ్చు.