News8th Jul 03:40 PMSunil Byrisetty1 min read
ప్రమాదాల నివారణకు “స్టాప్, వాష్, రిఫ్రెష్ అండ్ గో”
రాత్రి సమయాలలో రోడ్డు ప్రమాదాలను నివారించాలన్న ముఖ్య ఉద్దేశంతో ఎన్.టి.ఆర్ జిల్లా నగర పోలీస్ కమీషనర్ ఎస్.వి.రాజ శేఖర బాబు ఆదేశాల మేరకు పోలీసు అధికారులు సిబ్బందితో కలిసి రాత్రి/ తెల్
రాత్రి సమయాలలో రోడ్డు ప్రమాదాలను నివారించాలన్న ముఖ్య ఉద్దేశంతో ఎన్.టి.ఆర్ జిల్లా నగర పోలీస్ కమీషనర్ ఎస్.వి.రాజ శేఖర బాబు ఆదేశాల మేరకు పోలీసు అధికారులు సిబ్బందితో కలిసి రాత్రి/ తెల్లవారుజాము సమయంలో
ప్రత్యక డ్రైవ్ నిర్వహిస్తున్నారు. తెల్లవారుజామున 2 గంటల నుంచి 5 గంటల వ్యవధిలో విజయవాడ మాచవరం మహానాడు రోడ్డులో, సత్యనారాయణపురం శారదా కళాశాల సమీపంలో, భవానిపురం గొల్లపూడి హైవే సమీపంలో, తిరువూరు హైవే సమీపంలో, జి. కొండూరు హైవే సమీపంలో, భవానిపురం హైవేల వద్ద పోలీసు అధికారులు స్టాప్, వాష్, రిఫ్రెష్ అండ్ గో కార్యక్రమాన్ని నిర్వహించారు. రాత్రి సమయాలలో ప్రధాన రహదారుల గుండా ప్రయాణించు వాహన డ్రైవర్లు నిద్ర లేకుండా ఎక్కువ దూరాలకు ప్రయాణించడం వలన తెల్లవారు జామున అనగా 2 గంటల నుంచి 5 గంటల ప్రాంతాలలో నిద్రలోకి జారుకోవడం వలన ఎక్కువగా ప్రమాదాలు జరుగుతున్నాయని గుర్తించామన్నారు. రోడ్డు ప్రమాదాల వలన ఎందరో ప్రాణాలను కోల్పోతున్నారని, ఎన్నో కుటుంబాలు ఇబ్బందులను ఎదుర్కోవడం జరుగుతుందని వివరించారు. ఈ నేపధ్యంలో స్టాప్, వాష్, రిఫ్రెష్ అండ్ గో కార్యక్రమం వలన చాల వరకు రాత్రి సమయాలలో రోడ్డు ప్రమాదాలను తగ్గించవచ్చనే లక్ష్యంతో నిర్వహిస్తున్నట్లు తెలిపారు.