National8th Nov 11:25 AMSunil Byrisetty1 min read

వీధి కుక్కల విషయంలో సుప్రీం కీలక ఆదేశాలు

వీధి కుక్కల విషయంలో దాఖలైన కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. రహదారులపైకి కుక్కలు, పశువులు రాకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక డ

వీధి కుక్కల విషయంలో సుప్రీం కీలక ఆదేశాలు
వీధి కుక్కల విషయంలో దాఖలైన కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. రహదారులపైకి కుక్కలు, పశువులు రాకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక డ్రైవ్ చేపట్టాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. డ్రైవ్ అమలుపై 8 వారాల్లో స్టేటస్ రిపోర్టు అందజేయాలని పేర్కొంది. స్కూల్స్‌, బస్టాండ్‌, రైల్వేస్టేషన్‌, ఆస్పత్రుల్లోకి కుక్కలు రాకుండా తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. వీధి కుక్కల నిర్వహణపై అమికస్ క్యూరీ నివేదికను అమలు చేయాలని, నివేదిక అమలుపై అఫిడవిట్ దాఖలు చేయకుంటే చర్యలు తప్పవని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
Supreme Court India
Supreme Court
Stray Dogs
Animal Control
India News
Supreme Court Order
Public Safety
Street Dogs
Animal Welfare
Government Directive
భారత వార్తలు
సుప్రీం కోర్టు ఆదేశాలు
ప్రజా భద్రత
Scroll for the next article