News15th Aug 04:41 PMSunil Byrisetty1 min read
స్త్రీ శక్తి పథకాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు..
స్త్రీ శక్తి పథకాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించారు. ఈ పథకం ద్వారా ఏపీ వ్యాప్తంగా ఉన్న మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం అందించనుంది. సీఎం చంద్రబాబు, డి
స్త్రీ శక్తి పథకాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించారు. ఈ పథకం ద్వారా ఏపీ వ్యాప్తంగా ఉన్న మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం అందించనుంది. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేష్.. గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం ఉండవల్లి గుహల నుంచి బస్సులో ప్రయాణిస్తూ ఈ పథకాన్ని ప్రారంభించారు. ఉండవల్లి సెంటర్, తాడేపల్లి ప్యాలెస్, తాడేపల్లి సెంటర్, కనకదుర్గ వారధి మీదుగా ప్రయాణించారు. మహిళలతో కలిసి విజయవాడ పండిట్ నెహ్రూ బస్టాండ్ వరకూ బస్సులో ప్రయాణించనున్నారు. విజయవాడ సిటీ బస్ టెర్మినల్ వద్ద జరిగే కార్యక్రమంలోనే పాల్గొనేందుకు ప్రజలు, టీడీపీ శ్రేణులు పెద్దఎత్తున తరలివచ్చారు. కాగా, మహిళలు 5 రకాల బస్సుల్లో ఉచిత ప్రయాణం చేసే వెసులుబాటును ప్రభుత్వం కల్పించింది . పల్లె వెలుగు, అల్ట్రా పల్లెవెలుగు బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం సౌకర్యం కల్పించారు. అలాగే సిటీ ఆర్డినరీ, ఎక్స్‌ప్రెస్, మెట్రో ఎక్స్‌ప్రెస్ బస్సుల్లోనూ మహిళలు ఉచిత ప్రయాణం చేయవచ్చు.