News19th Aug 02:23 PMSunil Byrisetty1 min read

స్త్రీశక్తి పథకం ప్రభుత్వానికి భారం కాదు, బాధ్యత

మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిస్తున్న స్త్రీశక్తి పథకం ప్రభుత్వానికి భారం కాదు, బాధ్యతని రవాణా శాఖామంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అన్నారు. ప్రజలు ఆనందించే ప్రతీ పథకాన్ని అవహేళన చేయ

స్త్రీశక్తి పథకం ప్రభుత్వానికి భారం కాదు, బాధ్యత
మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిస్తున్న స్త్రీశక్తి పథకం ప్రభుత్వానికి భారం కాదు, బాధ్యతని రవాణా శాఖామంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అన్నారు. ప్రజలు ఆనందించే ప్రతీ పథకాన్ని అవహేళన చేయటమే వైసీపీ పనిగా పెట్టుకుందని మండిపడ్డారు. దిగ్విజయంగా అమలవుతున్న స్త్రీ శక్తి పథకాన్ని చూసి కడుపుమంటతో ఓర్వలేకపోతోందన్నారు. ఆధార్, పాన్, ఓటర్ కార్డుల లాంటివి జిరాక్సులు, సాఫ్ట్ కాపీలు కూడా అనుమతిస్తున్నామని, ఘాట్ రోడ్లలోనూ మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిస్తున్నామని స్పష్టం చేశారు. స్త్రీ శక్తి పథకం దిగ్విజయంగా అమలు కావడం వైసీపీ వారికి నచ్చడం లేదన్నారు. కూటమి ప్రభుత్వం అందిస్తున్న పథకాల అమలులో వైసీపీ నాయకులు సలహాలు, సూచనలు ఇవ్వాలి కానీ, అక్కసుతో ప్రవర్తించడం పట్ల ప్రజలు హర్షించారు, సమంజసం కాదని మంత్రి వ్యాఖ్యానించారు.
Andhra Pradesh news
Stree Shakti Scheme
Free Travel For Women
Transport Minister
Women Empowerment
YSRCP
రవాణాశాఖామంత్రి
మహిళాశక్తి
Scroll for the next article