News15th Aug 05:17 PMSunil Byrisetty1 min read
స్త్రీశక్తితో మహళలకు ఆర్థిక వెసులుబాటు
'మహిళా సంక్షేమానికి చంద్రబాబు ఎప్పుడూ పెద్దపీట వేస్తారు. ఇప్పుడు స్త్రీ శక్తి పథకం ద్వారా ఫ్రీ బస్సు ప్రయాణం ప్రవేశపెట్టారు. ఈ పథకం మహిళలకు మరింత శక్తిని ఇస్తుంద"ని రాష్ట్ర విద్య,
'మహిళా సంక్షేమానికి చంద్రబాబు ఎప్పుడూ పెద్దపీట వేస్తారు. ఇప్పుడు స్త్రీ శక్తి పథకం ద్వారా ఫ్రీ బస్సు ప్రయాణం ప్రవేశపెట్టారు. ఈ పథకం మహిళలకు మరింత శక్తిని ఇస్తుంద"ని రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ అన్నారు. విజయవాడ పండిట్ నెహ్రూ బస్ స్టేషన్లో స్త్రీశక్తి ఉచిత బస్సు ప్రయాణం కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబుతో కలసి మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ.. స్త్రీశక్తి పథకం వల్ల విద్యార్థినులు, ఉద్యోగాలు చేసుకునే మహిళల పై భారం తగ్గుతుందని తెలిపారు. ఉచిత బస్సు ప్రయాణం ద్వారా నెలకు రూ.1500 భారం తగ్గుతుందన్నారు. 2019లో అధికారంలోకి వచ్చిన ఒక రాక్షసుడు మద్యనిషేధం చేస్తానని చెప్పి, విషం కంటే ప్రమాదకర మద్యం అమ్మి మహిళల తాళిబొట్లు తెంచాడని మండిపడ్డారు. యువగళం పాదయాత్రలో మీ కష్టాలు చూశాకే సూపర్ -6 పథకాన్ని ప్రవేశపెట్టాలని కోరానన్నారు.