News27th Nov 11:25 AMSunil Byrisetty1 min read

ఏపీ-లింక్ ను ఆర్థికంగా బలోపేతం చేయండి

ఆంధ్రప్రదేశ్ లాజిస్టిక్స్ అండ్ ఇన్ఫ్రాస్టక్చర్ కార్పోరేషన్ – ఏపీ లింక్ సంస్థను ఆర్థికంగా బలోపేతం చేయడమే లక్ష్యంగా పని చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారు. రాష్ట్రం

ఏపీ-లింక్ ను ఆర్థికంగా బలోపేతం చేయండి
ఆంధ్రప్రదేశ్ లాజిస్టిక్స్ అండ్ ఇన్ఫ్రాస్టక్చర్ కార్పోరేషన్ – ఏపీ లింక్ సంస్థను ఆర్థికంగా బలోపేతం చేయడమే లక్ష్యంగా పని చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారు. రాష్ట్రంలోని రహదారులను గుంతలు లేకుండా తీర్చిదిద్దడమే ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యతా అంశమని సీఎం స్పష్టం చేశారు. సచివాలయంలో ఆర్ అండ్ బి శాఖపై సీఎం చంద్రబాబు సమీక్షించారు. ‘ప్రభుత్వం త్వరలో ఏర్పాటు చేయబోతున్న ఏపీ-లింక్ సంస్థ ద్వారా పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు చేయాలి. ఇప్పటి నుంచే దీనిపై ప్రణాళికలు రూపొందించాలి. లాజిస్టిక్స్ కార్పొరేషన్ ను బలోపేతం చేసే క్రమంలో రహదారులు భవనాల శాఖకు వివిధ మార్గాల్లో వచ్చే ఆదాయాలను ఎంత వరకు వినియోగించుకోవచ్చో చూడాలి. లాజిస్టిక్స్ రంగంలో పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తే సంస్థ ఆర్థికంగా బలోపేతం చేయడానికి మార్గం సుగమం అవుతుంది. అప్పుడు రాష్ట్రంలోని రహదారుల నెట్ వర్క్ తో పాటు ఇతర మౌలిక సదుపాయాలను అద్భుతంగా తీర్చిదిద్దవచ్చు.” అని సీఎం చెప్పారు.
AP Link
Andhra Pradesh Government
Logistics Corporation
Infrastructure Development
R&B Department
Chandrababu Naidu
రహదారి అభివృద్ధి
ఏపీ లాజిస్టిక్స్
ఆర్థిక బలోపేతం
అభివృద్ధి ప్రణాళికలు
Scroll for the next article