News13th Oct 05:18 PMSunil Byrisetty1 min read
గ్రామీణాభివృద్ధికి రహదారుల బలోపేతం కీలకం
గ్రామీణ మౌలిక సదుపాయాల బలోపేతమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతోందని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ఇందులో భాగంగా ఆత్మకూరు ప్రజల చిరకాల స్వప్నాన్ని సాకారం చేస్తూ
గ్రామీణ మౌలిక సదుపాయాల బలోపేతమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతోందని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ఇందులో భాగంగా ఆత్మకూరు ప్రజల చిరకాల స్వప్నాన్ని సాకారం చేస్తూ, ఎన్‌హెచ్-67 నుంచి ఆత్మకూరు బైపాస్ వరకు రూ. 8.91 కోట్ల వ్యయంతో నాలుగు లేన్స్ రహదారిని అభివృద్ధి చేసి అందుబాటులోకి తీసుకొచ్చామని తెలిపారు. మొత్తం 2.2 కిలోమీటర్ల మేర ఆధునిక హంగులతో రూపుదిద్దుకున్న ఈ రహదారికి వాయుపుత్ర మార్గ్ గా నామకరణం చేసినట్లు వెల్లడించారు. మంగళగిరి క్యాంపు కార్యాలయం నుంచి ఆత్మకూరు రహదారిని వర్చువల్ గా ప్రారంభించారు. “ఆత్మకూరు ప్రజల చిరకాల స్వప్నమైన NH-67 నుంచి ఆత్మకూరు బైపాస్ వరకు నాలుగు వరుసల రహదారి విస్తరణ పనులు సాకారం కావడం ఎంతో సంతోషకరం. ప్రజలకు మెరుగైన ప్రయాణ సౌకర్యాలు కల్పించడంతో పాటు, ట్రాఫిక్ సమస్యలను తగ్గించి, ఈ ప్రాంత అభివృద్ధికి మరింత ఊతమిచ్చే లక్ష్యంతో మొత్తం రూ. 8.91 కోట్లతో ఈ అభివృద్ధి పనులు చేపట్టామ’ని వివరించారు.