News7th Jan 03:02 PMSunil Byrisetty1 min read
కోడి పందేలు నిర్వహిస్తే కఠిన చర్యలు
సంక్రాంతి పండగ సందర్భంగా ఎక్కడైనా కోడి పందేలు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని, చట్టాలపై గ్రామాలు మొదలు జిల్లాస్థాయి వరకు ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించ
సంక్రాంతి పండగ సందర్భంగా ఎక్కడైనా కోడి పందేలు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని, చట్టాలపై గ్రామాలు మొదలు జిల్లాస్థాయి వరకు ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ పేర్కొన్నారు. కలెక్టర్ లక్ష్మీశ మాట్లాడుతూ హైకోర్టు ఆదేశాలకు అనుగుణంగా ఏర్పాటుచేసిన గ్రామ, మండల, డివిజన్ స్థాయి కమిటీలు ప్రజాప్రతినిధుల భాగస్వామ్యంతో క్షేత్రస్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించారు. గ్రామసభలు నిర్వహించి, చట్టాలపై అవగాహన కల్పించాలని, వీఆర్‌వో, తహశీల్దార్, ఆర్‌డీవోల సారథ్యంలోని కమిటీలు అప్రమత్తంగా ఉండాలన్నారు. విస్తృత స్థాయిలో తనిఖీలు నిర్వహించి ఎక్కడా కోడి పందేలు జరక్కుండా చూడాలన్నారు. కోడిపందేలు నిర్వహించడం, పాల్గొనడం చట్టరీత్యా నేరమని.. నిబంధనలు ఉల్లంఘిస్తే ఆంధ్రప్రదేశ్ గేమింగ్ యాక్ట్-1974లోని సెక్షన్-10, జంతు హింస నివారణ చట్టం-1960లోని సెక్షన్ 34 ప్రకారం క్రిమినల్ చర్యలు తీసుకోవడం జరుగుతుందని స్పష్టం చేశారు. ఇదేవిధంగా ఈ నెల 14 నుంచి 31వ తేదీ వరకు జంతు సంక్షేమ పక్షోత్సవాలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు.