News8th Aug 12:43 PMSunil Byrisetty1 min read

ఫుడ్ క్వాలిటీపై మంత్రి నాదెండ్ల వార్నింగ్

ఆహారం తయారీలొ నాణ్యతా ప్రమాణాలు తప్పనిసరి అని ఆహార, పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. నాణ్యతా ప్రమాణాలు పాటించని హోటల్స్, ఫుడ్ కోర్టులు, సంస్థలపై కఠిన చర్యలు తీ

ఫుడ్ క్వాలిటీపై మంత్రి నాదెండ్ల వార్నింగ్
ఆహారం తయారీలొ నాణ్యతా ప్రమాణాలు తప్పనిసరి అని ఆహార, పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. నాణ్యతా ప్రమాణాలు పాటించని హోటల్స్, ఫుడ్ కోర్టులు, సంస్థలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సరైన పదార్థాలు వాడకపోవడం వల్ల ప్రజలకు అనారోగ్య సమస్యలు ఎదురవుతున్నాయన్నారు. కొన్ని హోటల్స్‌లో హానికర పదార్థాలు కలిపి ఆహారం తయారు చేస్తున్నారని మండిపడ్డారు. ప్రజలు బయట ఆహారం తీసుకునేటప్పుడు అప్రమత్తంగా ఉండాలని అన్నారు. ఈ విషయంపై మంత్రివర్గ ఉపసంఘం కూడా చర్చించి, అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగిందన్నారు. ఇటీవల విశాఖపట్నంలో నిర్వహించిన తనిఖీలలో 51 రెస్టారెంట్లలో 44 రెస్టారెంట్లు నాణ్యతా ప్రమాణాలకు విరుద్ధంగా ఆహారాన్ని తయారుచేస్తున్నట్లు వెల్లడైందని తెలిపారు.
Andhra Pradesh Government
Food Safety
Quality Standards
Nandendla Manohar
Hotel Inspections
Visakhapatnam
Public Health
Food Court Regulations
Harmful Ingredients
Restaurant Crackdown
ఫుడ్ క్వాలిటీపై మంత్రి నాదెండ్ల వార్నింగ్
Scroll for the next article