Telangana24th Dec 02:47 PMSunil Byrisetty1 min read
హద్దులు దాటితే కఠిన చర్యలే.. పోలీస్ వార్నింగ్
నూతన సంవత్సర వేడుకల సందర్భంగా పోలీసులు వార్నింగ్ ఇచ్చారు. వేడుకలను ప్రజలు ప్రశాంతంగా, సురక్షితంగా జరుపుకునేలా చూడడానికి హైదరాబాద్ పోలీసులు సమాయత్తమవుతున్నారు. ఈ క్రమంలో న్యూ ఇయర్ ఈ
నూతన సంవత్సర వేడుకల సందర్భంగా పోలీసులు వార్నింగ్ ఇచ్చారు. వేడుకలను ప్రజలు ప్రశాంతంగా, సురక్షితంగా జరుపుకునేలా చూడడానికి హైదరాబాద్ పోలీసులు సమాయత్తమవుతున్నారు. ఈ క్రమంలో న్యూ ఇయర్ ఈవెంట్లలో నిర్వాహకులు గానీ, ప్రజలు గానీ హద్దులు దాటినా లేక నిబంధనలు అతిక్రమించినా కఠిన చర్యలు తప్పవని హైదరాబాద్ సీపీ సజ్జనార్ హెచ్చరించారు. “నిబంధనలు ఉల్లంఘిస్తే కొత్త సంవత్సరం సంతోషం లేకుండా పోతుంది” అంటూ ఆయన వార్నింగ్ ఇచ్చారు. న్యూ ఇయర్ సందర్భంగా నగరంలో నిర్వహించే పార్టీలకు సంబంధించి తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పాటించాల్సిన విధి విధానాలపై సీపీ సజ్జనార్ క్షేత్రస్థాయి పోలీస్ సిబ్బందితో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా భద్రతా ఏర్పాట్లపై కీలక ఆదేశాలు జారీ చేశారు. పార్టీల నిర్వహణకు ముందుగా పోలీస్ అనుమతి పొందాలని, సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.