News7th Nov 05:39 PMSunil Byrisetty1 min read
ఆహార తయారీలో ప్రమాణాలు పాటించాలి
మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులు ఆహార ఉత్పత్తుల తయారీలో నాణ్యత, భద్రత, పరిశుభ్రత ప్రమాణాలను తప్పనిసరిగా పాటించాలని జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ సూచించారు. ఇబ్రహీంపట్నం మండలం గుం
మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులు ఆహార ఉత్పత్తుల తయారీలో నాణ్యత, భద్రత, పరిశుభ్రత ప్రమాణాలను తప్పనిసరిగా పాటించాలని జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ సూచించారు. ఇబ్రహీంపట్నం మండలం గుంటుపల్లి గ్రామంలోని రైజ్ కేంద్రం ఆధ్వర్యంలో ఆహార భద్రత, పరిశుభ్రత అంశాలపై నిర్వహించిన ప్రత్యేక అవగాహన వర్క్‌షాప్‌లో కలెక్టర్ ఈ సూచనలు చేశారు. మహిళా సంఘాల సభ్యులు తయారు చేసే ఆహార ఉత్పత్తులు నాణ్యతతో పాటు వినియోగదారులకు పూర్తి భద్రత కల్పించే విధంగా ఉండాలన్నారు. పరిశుభ్రమైన వాతావరణంలో ఆహార పదార్థాలను తయారు చేయడం ద్వారా వినియోగదారుల విశ్వాసాన్ని పొందవచ్చని తెలిపారు. ఆహార ఉత్పత్తుల తయారీ, ప్యాకేజింగ్, మార్కెటింగ్ రంగాల్లో అవసరమైన నైపుణ్యాలను పెంపొందించుకుని మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించాలని ఆకాంక్షించారు. రైజ్ కేంద్రం ద్వారా మహిళల్లో నైపుణ్యాభివృద్ధి పెంపొందించడంతో పాటు ఉపాధి, స్వయం ఉపాధి అవకాశాలను మెరుగుపరిచేందుకు ఇటువంటి శిక్షణా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.