News22nd Jan 03:18 PMSunil Byrisetty1 min read
వైద్య విద్య పరీక్షల తీరుపై మరింత నిఘా
వైద్య విద్య పరీక్షల్లో పారదర్శకతను పెంచే చర్యల్లో భాగంగా ఎన్టీఆర్ ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయంలో 'రిమోట్ కమాండ్ కంట్రోల్'ను ఏర్పాటు చేసినట్లు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యా
వైద్య విద్య పరీక్షల్లో పారదర్శకతను పెంచే చర్యల్లో భాగంగా ఎన్టీఆర్ ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయంలో 'రిమోట్ కమాండ్ కంట్రోల్'ను ఏర్పాటు చేసినట్లు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ వెల్లడించారు. రాష్ట్రంలోని 37 ప్రభుత్వ, ప్రైవేటు వైద్య కళాశాలల్లో జరిగే యూజీ, పీజీ మెడికల్ వార్షిక/సప్లిమెంటరీ పరీక్షల తీరును సీసీ కెమెరాల ద్వారా విశ్వవిద్యాలయంలోని కమాండ్ కంట్రోల్ రూము నుంచి పర్యవేక్షిస్తుంటారని తెలిపారు. దీనివల్ల కాపీయింగ్ వంటి ఘటనలకు అవకాశం ఉండదని తెలిపారు. వైద్య విద్య పరీక్షల్లో కాపీయింగ్ నిరోధానికి ప్రభుత్వ, ప్రైవేటు వైద్య కళాశాలల్లోని పరీక్షలు జరిగే గదుల్లో ఉండే సీసీ కెమెరాలకు విశ్వవిద్యాలయంలోని కంట్రోలు రూముకు అనుసంధానం చేసినట్లు మంత్రి తెలిపారు. అన్ని కోర్సుల్లో కలిపి వార్షిక, సప్లిమెంటరీ పరీక్షల కింద ఏడాదికి సుమారు 60వేల మంది పరీక్షలు రాస్తుంటారని తెలిపారు. ఎంబీబీఎస్, పీజీ పరీక్షల నుంచి డెంటల్, ఆయుర్వేద, హోమియో, నర్సింగ్ ఇతర కోర్సుల్లో చదివే విద్యార్థులకు నిర్వహించే పరీక్షలను సైతం రిమోట్ కమాండ్ కంట్రోల్ రూము ద్వారా పర్యవేక్షిస్తామని వివరించారు.