News3rd Nov 05:10 PMSunil Byrisetty1 min read
వరద నివారణకు పటిష్ట చర్యలు
రాజధాని అమరావతిలో వరద నివారణకు పటిష్టమైన చర్యలు చేపట్టాలని అమరావతి అభివృద్ధి సంస్థ(ఏడీసీ) ఛైర్‌పర్సన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ డి.లక్ష్మీపార్థసారథి అధికారుల
రాజధాని అమరావతిలో వరద నివారణకు పటిష్టమైన చర్యలు చేపట్టాలని అమరావతి అభివృద్ధి సంస్థ(ఏడీసీ) ఛైర్‌పర్సన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ డి.లక్ష్మీపార్థసారథి అధికారులను ఆదేశించారు.
మురసు తుఫాను కారణంగా రాజధాని అమరావతి గుండా ప్రవహిస్తున్న కొండవీటివాగు, పాలవాగు, పేరమ్మవాగు, కొటేళ్ల వాగుల్లో వరదనీటి ప్రవాహాన్ని మంగళవారం ఏడీసీ ఇంజినీరింగ్ అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
లాం, పెదపరిమి నుంచి వస్తున్న వరద నీరు నీరుకొండ రిజర్వాయర్ చుట్టూ డైవర్షన్ ఛానెల్ గుండా వెళుతున్న ప్రవాహానికి ఎక్కడా ఆటంకం లేకుండా చూడాలని ఆదేశించారు. ఉండవల్లికి వస్తున్న వరదనీటిని రోజుకు 180 క్యూసెక్కుల వరదనీటిని కృష్ణానదిలోనికి పంపింగ్ స్టేషన్ ఎస్కేప్‌ల ద్వారా పంపిస్తున్నట్లు తుఫాను విధులను పర్యవేక్షిస్తున్న ఛీఫ్ ఇంజినీరు నివేదించారు.